ఎస్సీ, ఎస్టీలకు వయోపరిమితి మరో ఐదేళ్లు సడలింపు
ABN , Publish Date - Oct 14 , 2026 | 04:33 AM
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రత్యక్ష నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కల్పించే గరిష్ఠ వయోపరిమితి సడలింపును ..
2031 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం జీవో
అమరావతి, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రత్యక్ష నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కల్పించే గరిష్ఠ వయోపరిమితి సడలింపును మరో ఐదేళ్లపాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వయోపరిమితి సడలించాలని ఏపీపీఎస్సీతో పాటు, పలువురు ప్రజాప్రతినిధులు, నిరుద్యోగ సంఘాల ప్రతినిధులు చేసిన విజ్ఞప్తులను, అభ్యర్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర, సబార్డినేట్ సర్వీస్ నిబంధనలు 1996లోని రూల్ 12కి తగిన సవరణలు చేస్తూ సాధారణ పరిపాలన శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ఉత్తర్వుల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు లభించే ఈ ఐదేళ్ల గరిష్ఠ వయోపరిమితి మినహాయింపు మే 31, 2031 వరకు అమల్లో ఉంటుంది.
ఈ వార్తలనూ చదవండి:
గిన్నిస్ బుక్‌లోకి 75 గంటల డప్పుమోత