సోమవారం కూడా సెలవే!
ABN , Publish Date - Oct 17 , 2026 | 05:22 AM
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా నాలుగు రోజులపాటు సెలవులు లభించాయి. మంగళవారం దసరా పండుగను పురస్కరించుకొని ముందురోజైన సోమవారం కూడా ప్రభుత్వం సెలవుదినంగా ప్రకటించింది.
హెడ్క్వార్టర్స్ ఉద్యోగులకు వర్తింపు.. వరుసగా 4 రోజులు దసరా హాలీడేస్
అమరావతి, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా నాలుగు రోజులపాటు సెలవులు లభించాయి. మంగళవారం దసరా పండుగను పురస్కరించుకొని ముందురోజైన సోమవారం కూడా ప్రభుత్వం సెలవుదినంగా ప్రకటించింది. దీంతో సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల ఉద్యోగులకు వరసగా నాలుగు రోజులు, ఇతర ప్రాంతాల వారికి వరసగా మూడు రోజులు సెలవులు లభించాయి. 17న హెడ్క్వార్టర్ ఉద్యోగులకు సెలవు. 18న ఆదివారం. 20న విజయదశమి సెలవు. అయితే 19న విధులు నిర్వహించి 20న పండుగకు ఇళ్లకు చేరుకోవడం ఇబ్బంది అవుతుందన్న ఉద్యోగుల విన్నపాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. అయితే రెండో శనివారమైన 14ను పనిదినంగా ప్రకటించింది. కాగా, సోమవారం సెలవుదినంగా ప్రకటించినందుకు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జి.రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు