Share News

‘వాస్సార్‌’కు ఉద్యాన సమాచార నిర్వహణ బాధ్యత

ABN , Publish Date - Oct 12 , 2026 | 04:05 AM

ఆంధ్రప్రదేశ్‌ హార్టికల్చర్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌(ఏపీహెచ్‌ఐఎంఎస్‌) రూపకల్పన, అభివృద్ధి, అమలు, నిర్వహణ, సంరక్షణ పనులను వాస్సార్‌ ల్యాబ్స్‌ ఐటీ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు..

‘వాస్సార్‌’కు ఉద్యాన సమాచార నిర్వహణ బాధ్యత

అమరావతి, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ హార్టికల్చర్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌(ఏపీహెచ్‌ఐఎంఎస్‌) రూపకల్పన, అభివృద్ధి, అమలు, నిర్వహణ, సంరక్షణ పనులను వాస్సార్‌ ల్యాబ్స్‌ ఐటీ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు ప్రభుత్వం అప్పగించింది. ఇందుకోసం కృషోన్నతి యోజన పథకంలోని డిజిటల్‌ అగ్రికల్చర్‌ మిషన్‌ విభాగం నిధుల నుంచి రూ.20.62 కోట్లు కేటాయించింది. భవిష్యత్తులో ఎట్టిపరిస్థితుల్లోనూ అదనపు నిధులు కేటాయింపు ఉండదనే షరతుతో కాంట్రాక్ట్‌ ఒప్పందాన్ని ఆరేళ్ల పాటు అమలు చేయాలని ఉద్యానశాఖ డైరెక్టర్‌ను ఆదేశించింది. ఈమేరకు ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ వార్తలనూ చదవండి...

నెల్లూరులో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు

రాయలసీమ అభివృద్ధి సభలో రాజకీయాలు వద్దు: పవన్ కల్యాణ్

Updated Date - Oct 12 , 2026 | 04:05 AM