కొలువుల బొనాంజా!
ABN , Publish Date - Oct 14 , 2026 | 04:29 AM
నిరుద్యోగులకు.. రాష్ట్ర ప్రభుత్వం దసరా కానుకగా కొలువుల బొనాంజా ప్రకటించింది. డీఎస్సీ, గ్రూప్-2 సహా.. ఇతర శాఖల్లో ఖాళీగా ఉన్న మొత్తం 4,187 పోస్టుల ...
యువతకు సర్కారు దసరా కానుక
డీఎస్సీ, గ్రూప్-2, ఇతర విభాగాల్లో 4,187 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు
డీఎస్సీలో 2,721 టీచర్ పోస్టుల భర్తీ
తహసీల్దార్ సహా గ్రూప్2 పోస్టులు 686
ఏఈఈ 503, డైట్ లెక్చరర్ 104
నవంబరు 2, 3 నుంచి దరఖాస్తులు
అమరావతి, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): నిరుద్యోగులకు.. రాష్ట్ర ప్రభుత్వం దసరా కానుకగా కొలువుల బొనాంజా ప్రకటించింది. డీఎస్సీ, గ్రూప్-2 సహా.. ఇతర శాఖల్లో ఖాళీగా ఉన్న మొత్తం 4,187 పోస్టుల భర్తీకి విడివిడిగా షార్ట్ నోటిఫికేషన్లు విడుదల చేసింది. పూర్తిస్థాయి నోటిఫికేషన్లను త్వరలోనే విడుదల చేయనున్నారు.
డీఎస్సీ విషయానికి వస్తే.. గత ఏడాది 16వేల పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించగా ఇప్పుడు 2,721 పోస్టులతో షార్ట్ నోటిఫికేషన్ ఇచ్చారు. దీనిలో ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్ పాఠశాలల్లో 2,111, స్పెషల్ ఎడ్యుకేషన్ 350, సొసైటీలు, మోడల్ స్కూల్స్‌లో 260 పోస్టులు ఉన్నాయి. నవంబరు 3 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. పరీక్షల తేదీలు, ఇతర వివరాలతో త్వరలో పూర్తిస్థాయి నోటిఫికేషన్ విడుదలకానుంది. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని పోస్టుల్లో స్కూల్ అసిస్టెంట్ 906, సెకండరీ గ్రేడ్ టీచర్ 1,205 పోస్టులు ఉన్నాయి.
స్పెషల్ ఎడ్యుకేషన్‌లో స్కూల్ అసిస్టెంట్ 150, సెకండరీ గ్రేడ్ టీచర్ 200 పోస్టులను భర్తీ చేయనున్నారు. సాంఘిక సంక్షేమ శాఖ పాఠశాలల్లో ప్రిన్సిపాల్స్ 21, పీజీటీ 45, పీఈటీ 19 పోస్టులు ఉన్నాయి. గిరిజన సంక్షేమ పాఠశాలల్లో 36, బీసీ సంక్షేమ పాఠశాలల్లో 37, రెసిడెన్షియల్ పాఠశాలల్లో 68, మోడల్ స్కూల్స్‌లో 19, దివ్యాంగ సంక్షేమ శాఖ పరిధిలోని పాఠశాలల్లో 15 పోస్టులు ఉన్నాయి. కంప్యూటర్ ఆధారిత విధానంలో డీఎస్సీ పరీక్షలు జరుగుతాయి.
ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో..
ఈ ఏడాది మూడో విడత ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) 10 షార్ట్ నోటిఫికేషన్లు జారీ చేసింది. వీటి ద్వారా 1466 పోస్టులను భర్తీ చేయనున్నారు. తర్వాత దశలవారీగా పూర్తిస్థాయి నోటిఫికేషన్లు విడుదల చేస్తారు. మంగళవారం విడుదల చేసిన నోటిఫికేషన్లలో వివిధ శాఖల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ పోస్టులు 503, దేవదాయశాఖలో డిప్యూటీ కమిషనర్ ఉద్యోగాలు 6, అసిస్టెంట్ కమిషనర్ పోస్టులు 5 ఉన్నాయి. అలాగే, గనుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టు 1, అదే శాఖలో టెక్నికల్ అసిస్టెంట్ 36, రాయల్టీ ఇన్‌స్పెక్టర్ 9, ల్యాబ్ అసిస్టెంట్ పోస్టు ఒకటి ఉంది. ఎక్సైజ్ శాఖలో అసిస్టెంట్ కెమికల్ ఎగ్జామినర్ 9, రవాణా శాఖలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ 50, గ్రూప్-2 పోస్టులు 686, డైట్ లెక్చరర్ 104, ఎస్‌సీఈఆర్‌టీ లెక్చరర్ 10, డైట్ సీనియర్ లెక్చరర్ 46 పోస్టులకు 10 నోటిఫికేషన్లు విడుదల చేశారు. నవంబరు 2 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది.
గ్రూప్-2 పోస్టులు ఇవీ..
గ్రూప్-2 నోటిఫికేషన్‌లో గ్రేడ్-3 మున్సిపల్ కమిషనర్: 6, గ్రేడ్-2 సబ్ రిజిస్ర్టార్: 7, డిప్యూటీ తహసీల్దార్: 200, జీఎస్టీ ఆఫీసర్: 40, సహకార శాఖలో అసిస్టెంట్ రిజిస్ర్టార్: 10, డిప్యూటీ మండల పరిషత్ డెవల్‌పమెంట్ ఆఫీసర్: 176, ఎక్సైజ్ ఎస్‌ఐ: 29, జీఏడీ ఏఎ్‌స వో: 71, ఆర్థిక శాఖ ఏఎస్‌వో: 5, న్యాయశాఖ ఏఎస్‌వో: 4, ట్రెజరీలో సీనియర్ అకౌంటెంట్: 90, జూనియర్ అకౌంటెంట్: 48 పోస్టులు ఉన్నాయి.
రెండో విడతలో 254 పోస్టులు
ఏపీపీఎస్సీ సోమవారం అర్థరాత్రి ఐదు నోటిఫికేషన్లను విడుదల చేసింది. అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ 196, స్టాటిస్టిక్స్‌లో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు 17, ఫ్యాక్టరీస్ సర్వీస్‌లో ఇన్‌స్పెక్టర్ పోస్టులు 12, కాలుష్య నియంత్రణ మండలిలో గ్రేడ్-2 అనలిస్ట్ 18, లెజిస్లేచర్ సెక్రటేరియట్ సర్వీ్‌సలో ఇంగ్లిష్, తెలుగు రిపోర్టర్ పోస్టులు 11 ఉన్నాయి. మంగళవారం నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. నవంబరు 2 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.
ఈ వార్తలనూ చదవండి:
గిన్నిస్ బుక్‌లోకి 75 గంటల డప్పుమోత