పాఠశాల విద్యలో 1,86,273 పోస్టులు
ABN , Publish Date - Nov 03 , 2026 | 07:20 AM
రాష్ట్రపతి ఉత్తర్వులు-2025 ప్రకారం పాఠశాల విద్యాశాఖకు ప్రభుత్వం పోస్టులను కేటాయించింది. పోస్టుల కేటాయింపుపై ఆర్థిక శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది
రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు వాటిని కేటాయిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు
అమరావతి, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్రపతి ఉత్తర్వులు-2025 ప్రకారం పాఠశాల విద్యాశాఖకు ప్రభుత్వం పోస్టులను కేటాయించింది. పోస్టుల కేటాయింపుపై ఆర్థిక శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాల విద్యాశాఖలో మొత్తం 1,86,273 పోస్టులు ఉన్నాయి. వాటిలో 1,61,369 మంది పనిచేస్తున్నారు. మరో 24,904 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ మేరకు జిల్లాల వారీగా పోస్టులు కేటాయిస్తున్నట్లు ఆర్థిక శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ఉత్తర్వుల ఆధారంగా కొత్త జిల్లాల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయుల విభజన ప్రక్రియ చేపడతారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల సంఖ్య ఆధారంగా పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేస్తుంది. ప్రస్తుతం ఉన్న జిల్లాలోనే ఉంటే ఆర్డర్ ఆఫ్ అలాట్‌మెంట్(నియామక ఆదేశాలు) అని, వేరే జిల్లాకు మారితే ఆర్డర్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్(బదిలీ ఆదేశాలు) అని ఉత్తర్వులు ఇస్తుంది.
అనారోగ్య సమస్యలు, ఇతర కొన్ని కేటగిరీలను ప్రాధాన్యతా జాబితాలో చేర్చారు. ఇకపై ఈ కేడర్ స్ట్రెంథ్ ఆధారంగానే ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
త్వరితగతిన రాష్ట్రానికి సాయం అందించండి.. కేంద్రానికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి
ఏపీ లిక్కర్ స్కామ్.. ఈడీ కస్టడీలో నిందితుడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి