Share News

బూడిద వినియోగంలో భేష్‌..!

ABN , Publish Date - Nov 03 , 2026 | 07:15 AM

శ్రీదామోదరం సంజీవయ్య థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం (జెన్‌కో) జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు సాధించింది.

 బూడిద వినియోగంలో భేష్‌..!

జెన్కో థర్మల్‌కు జాతీయ పురస్కారం

ముత్తుకూరు, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): శ్రీదామోదరం సంజీవయ్య థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం (జెన్‌కో) జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు సాధించింది. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరులోని ఈ కేంద్రం విద్యుత్‌ ఉత్పత్తితోపాటు పర్యావరణ పరిరక్షణ, పారిశ్రామిక వ్యర్థాల సమర్థ వినియోగంలోనూ సత్తా చాటి జాతీయ అవార్డు అందుకుంది. నేషనల్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ అవార్డ్సు-2026లో భాగంగా ఫ్లైయాష్‌ (బూడిద) వినియోగంలో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు ‘ఎక్సలెన్స్‌ ఇన్‌ ఫ్లైయాష్‌ యుటిలైజేషన్‌’ విభాగంలో విజేతగా నిలిచింది. 500-1000 మెగావాట్ల సామర్థ్యం గల ఐపీపీ విభాగంలో సస్టెయినబుల్‌ పెర్ఫామెన్స్‌ అవార్డును కైవసం చేసుకుంది. గోవాలో అక్టోబరు 31న జరిగిన 26వ నేషనల్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ సదస్సులో జెన్కో థర్మల్‌ కేంద్రం చీఫ్‌ ఇంజనీర్‌, ఎల్‌.మధుసూదన్‌రావు ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందుకున్నారు.

ఈ సందర్భంగా సోమవారం ఆయన మాట్లాడుతూ... థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తిలో వచ్చే బూడిదను సమర్థవంతంగా వినియోగించడం, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమివ్వడం, స్థిరమైన వ్యర్థాల నిర్వహణ విధానాలను అమలు చేయడంలో జెన్కో కనబరిచిన కృషికి ఈ గుర్తింపు దక్కిందన్నారు. ఈ జాతీయ పురస్కారం సాధించడం పట్ల విద్యుత్‌ కేంద్రం అధికారులు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

త్వరితగతిన రాష్ట్రానికి సాయం అందించండి.. కేంద్రానికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి

ఏపీ లిక్కర్ స్కామ్.. ఈడీ కస్టడీలో నిందితుడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి

Updated Date - Nov 03 , 2026 | 07:15 AM