Share News

మున్సిపల్‌ కమిషనర్ల కేటాయింపులు ఖరారు

ABN , Publish Date - Nov 11 , 2026 | 04:37 AM

మల్టీజోన్ల వారీ రాష్ట్రంలోని మున్సిపల్‌ కమిషనర్ల తుది కేటాయింపులను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

మున్సిపల్‌ కమిషనర్ల కేటాయింపులు ఖరారు

  • మల్టీజోన్‌-1కు 15 మంది, మల్టీజోన్‌-2కు 14 మంది

అమరావతి, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): మల్టీజోన్ల వారీ రాష్ట్రంలోని మున్సిపల్‌ కమిషనర్ల తుది కేటాయింపులను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రెసిడెన్షియల్‌ ఆర్డర్‌-2025 నిబంధనలు, ఉద్యోగుల స్థానిక క్యాడర్ల కేటాయింపునకు సంబంధించిన మార్గదర్శకాల మేరకు ఈ ప్రక్రియ చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌-1 అధికారుల నుంచి ప్రభుత్వం ఆప్షన్‌ ఫారాలను స్వీకరించింది.

వాటి ఆధారంగా రాష్ట్ర స్థాయి అమలు కమిటీ తుది కేటాయింపుల జాబితాను ఆమోదించింది. మల్టీజోన్‌-1కు మొత్తం 15 మంది, మల్టీజోన్‌-2కు 14 మంది అధికారులను కేటాయించారు. ఉత్తర్వుల అమలుకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ సీఅండ్‌డీని ప్రభుత్వం ఆదేశించింది.

ఈ వార్తలనూ చదవండి:

విశాఖ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ సేవల రద్దు

30 ఏళ్లు దాటినా రాజీవ్ గాంధీ భౌతికకాయం ఫొటో చూడని సోనియా!

Updated Date - Nov 11 , 2026 | 04:40 AM