ఉద్యోగుల క్రమబద్ధీకరణ గడువు పెంపు
ABN , Publish Date - Oct 07 , 2026 | 04:46 AM
రాష్ట్రంలో అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘నిధి’ పోర్టల్ ద్వారా క్రమబద్ధీకరణ దరఖాస్తుల పరిశీలన, సమర్పణ గడువును డిసెంబరు 31 వరకు పొడిగిస్తూ ఆర్థిక శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
‘కాంట్రాక్టు’లకు డిసెంబరు 31 వరకు పొడిగింపు
అమరావతి, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘నిధి’ పోర్టల్ ద్వారా క్రమబద్ధీకరణ దరఖాస్తుల పరిశీలన, సమర్పణ గడువును డిసెంబరు 31 వరకు పొడిగిస్తూ ఆర్థిక శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో పొడిగించిన గడువు సెప్టెంబరు 30తో ముగిసినప్పటికీ వివిధ విభాగాలు, శాఖాధిపతులు సాంకేతిక, పాలనాపరమైన ఇబ్బందుల వల్ల పరిశీలన ప్రక్రియను పూర్తి చేయలేకపోయారని గుర్తించింది. ఈ నేపథ్యం లో ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ గడువును పెంచుతున్నట్టు తెలిపింది. సెకండరీ హెల్త్ ఉద్యోగులకు కూడా ఈ పొడిగింపు వర్తిస్తుందని పేర్కొంది. డిసెంబరు 31లోగా అర్హులైన వారి దరఖాస్తులను తప్పనిసరిగా సమర్పించాలని ఆర్థిక శాఖ కార్యదర్శి వాడ్రేవు వినయ్‌చంద్ స్పష్టం చేశారు.
ఈ వార్తలనూ చదవండి..
అమరావతి పనుల్లో వేగం పెంచాలి.. ప్రతి నెల రూ. 2వేల కోట్ల పనులు పూర్తి చేయాలి: సీఎం
స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పోటీ చేసే స్థానాలు ఖరారు..!