Share News

ఎన్నికల ఫిర్యాదులకు కంట్రోల్‌ రూమ్‌

ABN , Publish Date - Oct 17 , 2026 | 04:39 AM

AP Election Commission, local body election complaints, AP election control room, election complaint phone numbers, 0866 2490023, M Mallikarjuna, Andhra Pradesh municipal elections, rural local body elections, APSEC email complaint, Vijayawada election office

 ఎన్నికల ఫిర్యాదులకు కంట్రోల్‌ రూమ్‌

  • ఫోన్‌ నంబర్లు 0866-2490023, 2490024, 2490025, 2490026

అమరావతి, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రజలు, అభ్యర్థుల నుంచి వచ్చే ఫిర్యాదులు, సమస్యల స్వీకరణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసింది. విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి ఎం.మల్లికార్జున తెలిపారు. ఈ నెల 14న పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. తొలుత పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికల నోటిఫికేషన్లు జారీచేసింది. ఎన్నికల ప్రక్రియలో ఎదురయ్యే ఇబ్బందులు, ఫిర్యాదులను కంట్రోల్‌ రూమ్‌ ద్వారా అధికారుల దృష్టికి తీసుకురావచ్చని పేర్కొంది. ఫోన్‌ నంబర్లు 0866-2490023, 2490024, 2490025, 2490026 ద్వారా సంప్రదించాలని లేదా ఈ మెయిల్‌ secy.apsec1@gmail.com, secy.apsec2@gmail.com ద్వారా ఫిర్యాదు చేయాలని తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి:

అంతా కొలిక్కి...

ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు

Updated Date - Oct 17 , 2026 | 04:39 AM