పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలి ఈసీ మార్గదర్శకాలను పక్కాగా అమలు చేయాలి: పునేఠా
ABN , Publish Date - Oct 20 , 2026 | 05:03 AM
న్నికల నిర్వహణపై కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలు, మున్సిపల్ కమిషనర్లు, జడ్పీ సీఈఓలు, డీపీఓలు, ఎన్నికల పరిశీలకులు, సంబంధిత అధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
అమరావతి, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): ఎన్నికల నిర్వహణపై కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలు, మున్సిపల్ కమిషనర్లు, జడ్పీ సీఈఓలు, డీపీఓలు, ఎన్నికల పరిశీలకులు, సంబంధిత అధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, ప్రశాంతంగా జరిగేలా సమన్వయంతో పని చేయాలని అధికారులకు చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనానికి ప్రాధాన్యం ఇస్తూ, ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. జిల్లా అధికారుల సందేహాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి ఎం.మల్లికార్జున నివృత్తి చేశారు. ఐజీ రాజకుమారి మాట్లాడుతూ శాంతిభద్రతలపై డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా రోజూ ఎస్పీలు, కమిషనర్లతో టెలీకాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నారని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఏడీజీ ఎన్.మధుసూదనరెడ్డి, మున్సిపల్ కమిషనర్ అండ్ డైరెక్టర్ సంపత్‌కుమార్, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కృష్ణతేజ పాల్గొన్నారు.
శాంతిభద్రతలపై ఉన్నతాధికారులతో సమీక్ష
ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని ఎస్‌ఈసీ అనిల్‌చంద్ర పునేఠా ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల కార్యదర్శి ఎం.మల్లికార్జునతో కలిసి సీఎస్ జి.సాయిప్రసాద్, డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా, శాంతిభద్రతల ఏడీజీ ఎన్.మధుసూధనరెడ్డి, ఐజీ బి.రాజకుమారితో సోమవారం ఎస్‌ఈసీ సమీక్ష నిర్వహించారు. ఎన్నికల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని, సు న్నిత, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో బందోబస్తును పునఃసమీక్షించి, అవసరమైనచోట అదనపు బలగాలు ఏర్పాటు చేస్తామని డీజీపీ చెప్పారు.