Share News

ప్రైవేటు వర్సిటీల నిబంధనలు సరళతరం

ABN , Publish Date - Oct 06 , 2026 | 06:44 AM

ప్రైవేటు యూనివర్సిటీల స్థాపనలో కఠిన నిబంధనలు ఉండకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు నిబంధనలను సరళతరం చేస్తూ ఉన్నత విద్యాశాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.

ప్రైవేటు వర్సిటీల నిబంధనలు సరళతరం

అమరావతి, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ విధానానికి అనుగుణంగా మార్పులు చేసింది. యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన విస్తీర్ణం, గదుల పరిమాణం, పరికరాల సంఖ్య లేదా విద్యార్థుల నిష్పత్తికి అనుగుణంగా పరికరాలు ఉండాలనే నిర్దిష్ట నిబంధనలు తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. అయితే వర్సిటీ ఆమోదించే విద్యా కార్యక్రమాల నిర్వహణకుకు తగిన మౌలిక వసతులు ఉండాలని స్పష్టం చేసింది.

ఈ వార్తలనూ చదవండి:

ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం.. ఉద్యోగుల శిక్షణపై సీఎం స్పెషల్ ఫోకస్

ఏపీలో నాలుగు కొత్త పోలీస్‌ కమిషనరేట్ల ఏర్పాటు.. జీవో జారీ చేసిన ప్రభుత్వం

Updated Date - Oct 06 , 2026 | 06:44 AM