ఇంజనీరింగ్‌లో ఏఐకే జై
ABN , Publish Date - Aug 12 , 2026 | 06:21 AM
ఇంజనీరింగ్ విద్యలో ట్రెండ్ మారుతోంది. గతేడాది వరకు కోర్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌కు డిమాండ్ ఉంటే ఈ ఏడాది అనూహ్యంగా సీఎ్‌సఈ-ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషీన్ లెర్నింగ్...
కోర్ కంటే ఏఐఎంఎల్‌కే డిమాండ్
సీఎ్‌సఈలో 70, సీఎస్‌ఈ-ఏఐలో 84% భర్తీ
ఈసీఈలో 18,286, మెకానికల్‌లో 4,865
సీఎస్‌ఈ, అనుబంధ కోర్సుల్లో 60,757 సీట్లు భర్తీ
ఐదు బ్రాంచ్‌ల్లో నిండిన సీట్లు పది లోపే
అమరావతి, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్ విద్యలో ట్రెండ్ మారుతోంది. గతేడాది వరకు కోర్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌కు డిమాండ్ ఉంటే ఈ ఏడాది అనూహ్యంగా సీఎ్‌సఈ-ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషీన్ లెర్నింగ్(ఏఐఎంఎల్)వైపు విద్యార్థులు మొగ్గు చూపుతున్నారు. ఆదివారం ఈఏపీసెట్ అడ్మిషన్ల తొలిదశ కౌన్సెలింగ్ పూర్తిచేసిన ఉన్నత విద్యాశాఖ.. విద్యార్థులకు సీట్లు కేటాయించింది. రాష్ట్రవ్యాప్తంగా 247 కాలేజీల్లో 1,51,312 సీట్లు కన్వీనర్ కోటాలో ఉండగా 1,07,239 సీట్లు భర్తీ అయ్యాయి. 44,073 సీట్లు మిగిలిపోయాయి. దీనిలో సీఎస్‌ఈ కోర్‌లో 44,883 సీట్లు అందుబాటులో ఉండగా 31,416 (69.99శాతం)సీట్లు భర్తీ అయ్యాయి. సీఎ్‌సఈ-ఏఐఎంఎల్‌లో 18,873 సీట్లకుగాను 15,819(83.81శాతం) సీట్లలో విద్యార్థులు చేరారు. సాధారణంగా విద్యార్థులు సీఎ్‌సఈ కోర్ బ్రాంచ్‌కే మొగ్గుచూపుతారు. కానీ, ఈసారి మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఏఐఎంల్‌కు ఎక్కువ ఆసక్తి చూపినట్లు అర్థమవుతోంది. అలాగే, సీఎ్‌సఈ-ఏఐ అండ్ డేటా సైన్స్‌లో 2,339 సీట్లకుగాను 1,917(81.85శాతం) సీట్లు భర్తీ అయ్యాయి. ఐటీలో 3,219 సీట్లు ఉంటే 2,553(79శాతం) నిండాయి. సీఎ్‌సఈ కాకుండా కేవలం ఏఐఎంఎల్ సీట్లు 6,309 ఉంటే 4,782(75శాతం) భర్తీ అయ్యాయి. ఇంజనీరింగ్‌లో సీఎ్‌సఈ తర్వాత ఎక్కువ డిమాండ్ ఉండే ఈసీఈలో సీట్లు మెరుగ్గానే నిండాయి. ఆ కోర్సులో 24,577 సీట్లు ఉంటే 18,286(74శాతం) సీట్లు విద్యార్థులకు కేటాయించారు. మెకానికల్ ఇంజనీరింగ్‌లో 7,388 సీట్లకుగాను 4,865(66శాతం) భర్తీ అయ్యాయి. సీఎస్‌ఈ డేటాసైన్స్‌లో 65శాతం, ఈఈఈలో 62శాతం, సివిల్‌లో 60శాతం, ఏఐ అండ్ డేటా సైన్స్‌లో 58శాతం, సీఎ్‌సఈ ఏఐలో 54శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ప్లానింగ్, ఐటీ అండ్ ఇంజనీరింగ్, సీఎస్ స్పెషల్ ఇన్ ఐఓటీ అండ్ ఆటోమేషిన్, కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫెసిలిటీస్ అండ్ సర్వీసెస్ ప్లానింగ్ కోర్సుల్లో పదిలోపే సీట్లు నిండాయి. తక్కువ సీట్లే ఉన్న 28 కోర్సుల్లో వంద శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఫుడ్ టెక్నాలజీ, డేటా అనలిటిక్స్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ డిజైన్, రోబోటిక్స్, పర్యావరణ ఇంజనీరింగ్ తదితర కోర్సులు వీటిలో ఉన్నాయి.
సీఎస్‌ఈకే డిమాండ్
సీఎస్‌ఈలో అంతర్గత పోటీ కనిపిస్తున్నా.. మొత్తంగా కంప్యూటర్ సైన్స్‌కే విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. కన్వీనర్ కోటాలో 1,51,312 సీట్లు ఉంటే వీటిలో 84,002 సీట్లు సీఎ్‌సఈ, దాని అనుబంధ కోర్సుల్లోనే ఉన్నాయి. వాటిలో 60,757(72.33శాతం) సీట్లు భర్తీ అయ్యాయి. సీఎ్‌సఈ, సీఎ్‌సఈ-ఏఐఎంఎల్, సీఎ్‌సఈ-డేటాసైన్స్, సీఎ్‌సఈ-ఏఐ, సీఎ్‌సఈ-ఏఐ అండ్ డేటాసైన్స్, సీఎ్‌సఈ(సైబర్ సెక్యూరిటీ), సీఎ్‌సఈ-ఐవోటీ, మరో 11 సీఎ్‌సఈ కోర్సులు ఈ ఏడాది అందుబాటులో ఉండగా ఈ సీట్లు చాలావరకు భర్తీ అయ్యాయి. ఇవి కాకుండా కేవలం ఏఐఎంఎల్, డేటాసైన్స్, క్వాంటమ్, క్లౌడ్ కంప్యూటింగ్ కోర్సులు కూడా ఉన్నాయి. అవి కూడా కలిపితే 1,03,081 సీట్లు మొత్తం సీఎ్‌సఈ, అనుబంధంగా ఉన్నాయి. వాటిలో 71.63శాతం సీట్లు భర్తీ అయ్యాయి.
16 కాలేజీల్లో 10ు కూడా నిండలేదు
కాలేజీల వారీగా చూస్తే 16 కాలేజీల్లో 10శాతం కంటే తక్కువ మంది అడ్మిషన్లు పొందారు. ఆ కాలేజీల్లో 5,622 సీట్లు ఉంటే కేవలం 359 భర్తీ అయ్యాయి. 26 కాలేజీల్లో 10 నుంచి 25శాతం లోపు సీట్లు భర్తీ అయ్యాయి. 54 కాలేజీల్లో 25-50శాతం మధ్య నిండాయి. 44 కాలేజీల్లో 50-75శాతం మధ్య, 16 కాలేజీల్లో 75-90శాతం మధ్య భర్తీ అయ్యాయి. 90శాతం దాటి సీట్లు నిండిన కాలేజీలు 91 ఉన్నాయి.
ఇవి కూడా చదవండి
భారతమాతకు ధైర్యవంతుడైన కుమారుడు ఖుదీరామ్ బోస్: పవన్ కల్యాణ్
నా హక్కుల కోసం పోరాడాను.. అదే నేను చేసిన తప్పు: హర్భజన్ సింగ్