Share News

అందరి భాగస్వామ్యంతో విపత్తుల నిర్వహణ

ABN , Publish Date - Oct 14 , 2026 | 05:03 AM

విపత్తుల నిర్వహణలో ప్రభుత్వ వ్యవస్థలతో పాటు ప్రతి కుటుంబం, యువత భాగస్వామ్యం అవసరమని ...

అందరి భాగస్వామ్యంతో విపత్తుల నిర్వహణ

  • ఏపీఎస్‌డీఎంఏ ఈడీ కౌసర్‌బానో

అమరావతి, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): విపత్తుల నిర్వహణలో ప్రభుత్వ వ్యవస్థలతో పాటు ప్రతి కుటుంబం, యువత భాగస్వామ్యం అవసరమని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కౌసర్‌ బానో అన్నారు. అంతర్జాతీయ విపత్తు ప్రమాద తగ్గింపు దినోత్సవం సందర్భంగా మంగళవారం తాడేపల్లిలోని డీఎంఏ కార్యాలయంలో రౌండ్‌ టేబుల్‌ వర్క్‌షాప్‌ నిర్వహించారు. కౌసర్‌ బానో మాట్లాడుతూ విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని విభాగాలూ సమన్వయంతో పని చేయడంతో పాటు ప్రతి ఒక్కరినీ సంసిద్ధులను చేసేలా చర్యలు చేపట్టడం చాలా ముఖ్యమని చెప్పారు.

ఈ వార్తలనూ చదవండి:

కొత్త డీఎస్సీలో 290 పోస్టులు

గిన్నిస్‌ బుక్‌లోకి 75 గంటల డప్పుమోత

Updated Date - Oct 14 , 2026 | 05:03 AM