అటవీ అమరుల త్యాగం మరువలేనిది: పవన్‌కల్యాణ్
ABN , Publish Date - Nov 11 , 2026 | 04:49 AM
మన అడవులు, వన్య ప్రాణులను కాపాడుతూ, విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అటవీ సిబ్బంది త్యాగం మరువలేదని ఉపముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్‌కల్యాణ్ అన్నారు.
అమరావతి, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): మన అడవులు, వన్య ప్రాణులను కాపాడుతూ, విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అటవీ సిబ్బంది త్యాగం మరువలేదని ఉపముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్‌కల్యాణ్ అన్నారు. రాష్ట్ర అటవీ అమర వీరుల దినోత్సవం సందర్భంగా మంగళవారం ‘ఎక్స్’ వేదికగా ఆయన నివాళులర్పించారు. ‘మనం పరిరక్షిస్తున్న అడవులు.. రేపటి తరాలకు మనం వదిలివెళ్లే వారసత్వం. సవాలుతో కూడిన, ప్రమాదకరమైన పరిస్థితుల్లో సేవలందిస్తున్న ప్రతి అటవీ అధికారి, ఫ్రంట్‌లైన్ సిబ్బందికి వందనాలు. వారి భద్రత, సంక్షేమం, గౌరవడం మనందరి సమిష్టి ప్రాధాన్యతగా ఉండాలి’ అని పవన్ పేర్కొన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
విశాఖ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ సేవల రద్దు
30 ఏళ్లు దాటినా రాజీవ్ గాంధీ భౌతికకాయం ఫొటో చూడని సోనియా!