వెంకన్న సేవలో భువనేశ్వరి
ABN , Publish Date - Sep 24 , 2026 | 07:18 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయక మండపానికి చేరుకోగా వేదపండితులు ఆశీర్వదించారు.
తిరుమల, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయక మండపానికి చేరుకోగా వేదపండితులు ఆశీర్వదించారు. అధికారులు లడ్డూప్రసాదాలు అంజేశారు. అనంతరం నారా భువనేశ్వరి విద్యుత్ బస్సులో ఎస్వీ మ్యూజియానికి వెళ్లారు. మ్యూజియంలోని పురాతన వస్తువులను, అక్కడ ఏర్పాటు చేసిన సౌకర్యాలను, వినియోగించిన టెక్నాలజీని భువనేశ్వరికి అదనపు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి వివరించారు.