శభాష్ గాయత్రీ!
ABN , Publish Date - Oct 07 , 2026 | 04:55 AM
ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల అన్నదాన కేంద్రంలో ఈ నెల 3న రెండు చేతుల్లేని సత్యనారాయణ అనే దివ్యాంగ భక్తుడికి బి.గాయత్రి అనే మహిళా సిబ్బంది అన్నప్రసాదం తినిపించిన వీడియో వైరల్ అయింది. దీనిపై సీఎం చంద్రబాబు స్పందించారు.
దివ్యాంగ భక్తుడికి అన్నప్రసాదం తినిపించిన మహిళా సిబ్బందికి సీఎం ప్రశంస
అమరావతి/ద్వారకాతిరుమల, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల అన్నదాన కేంద్రంలో ఈ నెల 3న రెండు చేతుల్లేని సత్యనారాయణ అనే దివ్యాంగ భక్తుడికి బి.గాయత్రి అనే మహిళా సిబ్బంది అన్నప్రసాదం తినిపించిన వీడియో వైరల్ అయింది. దీనిపై సీఎం చంద్రబాబు స్పందించారు. దివ్యాంగుడికి అన్నప్రసాదం తినిపించే వీడియోను ట్వీట్ చేసి, ఆమెకు అభినందనలు తెలిపారు. ‘శభాష్ గాయత్రీ.. దివ్యాంగ భక్తుడికి అన్నం తినిపించి ఆకలి తీర్చిన మీ సహృదయానికి వందనాలు. మానవసేవే మాధవ సేవ అని చాటి చెప్పిన మీ స్ఫూర్తి అభినందనీయం’ అంటూ సీఎం తన పోస్టులో పేర్కొన్నారు. తనను ముఖ్యమంత్రి అభినందించడంపై గాయత్రి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి..
అమరావతి పనుల్లో వేగం పెంచాలి.. ప్రతి నెల రూ. 2వేల కోట్ల పనులు పూర్తి చేయాలి: సీఎం
స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పోటీ చేసే స్థానాలు ఖరారు..!