28 జడ్పీలూ మనవే కావాలి!
ABN , Publish Date - Nov 03 , 2026 | 05:33 AM
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని, ఈ ఎన్నికలను పాడు చేసేందుకు పులివెందులో గొడ్డలి పార్టీ నేత జగన్ ప్రయత్నించారని సీఎం చంద్రబాబు అన్నారు. సోమవారం కూటమి పార్టీల ముఖ్యనేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
ప్రతి మండలంలో కూటమి జెండా ఎగరాలి
కౌంటింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండండి
ఎన్నికలను పాడు చేసేందుకు గొడ్డలి పార్టీ యత్నం
కూటమి నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
అమరావతి, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని, ఈ ఎన్నికలను పాడు చేసేందుకు పులివెందులో గొడ్డలి పార్టీ నేత జగన్ ప్రయత్నించారని సీఎం చంద్రబాబు అన్నారు. సోమవారం కూటమి పార్టీల ముఖ్యనేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. జనసేన నుంచి మంత్రి నాదెండ్ల మనోహర్, బీజేపీ అధ్యక్షుడు మాధవ్ ఈ టెలీకాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. నగర, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ముఖ్యమని, 28 జిల్లాల జడ్పీ చైర్‌పర్సన్‌లను కూటమి పార్టీలే కైవశం చేసుకోవాలని సూచించారు. ప్రతి మండలంలోనూ కూటమి జెండా రెపరెపలాడాలని, ఆ దిశగా ఎంపీటీసీ స్థానాల్లో పైచేయి సాధించాలన్నారు.
ప్రతి గ్రామంలోనూ పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, ప్రతి ఇంటికీ సంక్షేమం అందించామని, ప్రజల ఆశలు నెరవేర్చేలా సుపరిపాలన అందిస్తున్నామని చెప్పారు. కూటమి పార్టీల పట్ల ప్రజలు సానుకూలతతో ఉన్నారని సీఎం తెలిపారు. కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని, కూటమి స్ఫూర్తితో అందరూ ఉమ్మడి కార్యాచరణ చేపట్టాలని కోరారు. కేంద్ర, రాష్ట్రాలతోపాటు స్థానికంగానూ ఎన్డీఏ ప్రభుత్వమే ఉండాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షల కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని.. ఈ విషయాలను ప్రజలకు వివరించాలని సూచించారు.
పోలింగ్ శాతం పెరగాలి
పట్టణ ఎన్నికల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదైందని, పరిషత్ ఎన్నికల్లో పెద్దఎత్తున పోలింగ్ జరిగేలా చూడాలని సీఎం దిశానిర్దేశం చేశారు. పోలింగ్ శాతం మరింత పెరగాలన్నారు. ఓ పక్క స్థానిక ఎన్నికల హడావుడి ఉండగానే.. అర్నబ్ తుఫానులో పెద్ద ఎత్తున విద్యుత్ స్తంభాలు కూలిపోయి.. విద్యుత్ వ్యవస్థ ఇబ్బందుల్లో పడిందన్నారు. అయినప్పటికీ, ప్రభుత్వం పూర్తి అప్రమత్తంగా ఉండి వ్యవస్థను పునరుద్ధరించిందని తెలిపారు. ఇప్పుడు మురసు తుఫాను ముప్పు పొంచి ఉందని, దీనిపై ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు.
ఈ వార్తలనూ చదవండి:
త్వరితగతిన రాష్ట్రానికి సాయం అందించండి.. కేంద్రానికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి
ఏపీ లిక్కర్ స్కామ్.. ఈడీ కస్టడీలో నిందితుడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి