పెయింటింగ్ వేసి.. డోలు వాయించి..
ABN , Publish Date - Nov 13 , 2026 | 05:07 AM
విశాఖ పారిశ్రామిక భాగస్వామ్య సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉత్సాహంగా కనిపించారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో కలిసి డోలు వాయించారు.
సదస్సులో ఉత్సాహంగా సీఎం చంద్రబాబు.. పీయూష్, పవన్, ఇతర నేతలతో మాటామంతి
అరకు కాఫీకి ప్రయోగాత్మకంగా మార్కెటింగ్
విశాఖపట్నం, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): విశాఖ పారిశ్రామిక భాగస్వామ్య సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉత్సాహంగా కనిపించారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో కలిసి డోలు వాయించారు. సీఐఐ వేదిక వద్ద ఆదివాసీ చిత్రాల పెయింటింగ్ వేశారు. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, కే రామ్మోహన్‌నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, రాష్ట్ర మంత్రులు లోకేశ్, టీజీ భరత్ తదితరులతో కలివిడిగా మాట్లాడుతూ కనిపించారు.
ఏజెన్సీ ప్రాంతంలో ప్రత్యేకంగా పండే కాఫీ గింజల విశిష్టతను వివరిస్తూ అరకు కాఫీకి ప్రయోగాత్మక మార్కెటింగ్ చేశారు. అంతకు ముందు సీఐఐ వేదిక వద్దకు చేరుకున్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఘన స్వాగతం పలికారు. కళాకారులు థింసా నృత్యం, తప్టెటగుళ్లు, గరగ నృత్యం ప్రదర్శిస్తుండగా గోయల్, చంద్రబాబు, పవన్ కూడా డోలు వాయించి వారిని ఉత్సాహపరిచారు. వివిధ కళా బృందాల కళాకారులు, పారిశుధ్య కార్మికులతో ఫొటోలు దిగారు.
అనంతరం సీఎం చంద్రబాబు, పీయూష్ గోయల్, పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ కలిసి ఏపీ పెవియన్, ఎంఎస్ఎంఈ పెవిలియన్‌ను ప్రారంభించారు. ఏ ప్రాంతాల్లో ఏయే పంటలు పడుతున్నాయి... ఏయే పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం ఉందనే విషయాన్ని డిజిటిల్ స్ర్కీన్‌పై చూపుతూ పీయూష్ గోయల్‌కు మంత్రి లోకేశ్ వివరించారు. వివిధ రంగాల్లో ఏపీ అభివృద్ధికి సంబంధించిన స్టోరీలను కేంద్ర మంత్రికి సీఎం వివరించారు.
ఈ వార్తలనూ చదవండి:
విశాఖలో 31వ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్-2026 ప్రారంభం
ఏపీకి పెట్టుబడుల వరద.. తొలిరోజే రూ.1.57 లక్షల కోట్ల ఒప్పందాలు