నేడు చంద్రబాబు, పవన్, మాధవ్ భేటీ
ABN , Publish Date - Oct 12 , 2026 | 03:59 AM
స్థానిక ఎన్నికలపై సోమవారం కూటమి అధినేతల కీలక భేటీ జరగనుంది. సీట్ల సర్దుబాటుపై చర్చించి తుది నిర్ణయం తీసుకునేందుకు...
స్థానికంలో సీట్ల సర్దుబాటుపై చర్చ
అమరావతి, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికలపై సోమవారం కూటమి అధినేతల కీలక భేటీ జరగనుంది. సీట్ల సర్దుబాటుపై చర్చించి తుది నిర్ణయం తీసుకునేందుకు సోమవారం సాయంత్రం 4 గంటలకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ భేటీ కానున్నారు. చంద్రబాబు నివాసంలో జరుగనున్న భేటీలో కూటమి పార్టీలు ఏయే స్థానాల నుంచి బరిలోకి దిగనుందనేది ఖరారు కానుంది. నేడు రిజర్వేషన్లు ఖరారు కానుండటం, 14న స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండటంతో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికే కూటమి పక్షాల రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీ పలుమార్లు భేటీ అయింది. తాము పోటీ చేయాలనుకుంటున్న స్థానాల జాబితాను జనసేన, బీజేపీలు అందజేశాయి. సోమవారం జరిగే అగ్రనేతల భేటీలో ఈ జాబితాలపై స్పష్టత రానుంది. ఈ భేటీలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కూడా పాల్గొననున్నారు.
ఈ వార్తలనూ చదవండి...
నెల్లూరులో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు
రాయలసీమ అభివృద్ధి సభలో రాజకీయాలు వద్దు: పవన్ కల్యాణ్