ప్రభుత్వంలో చేరిన రోజే ప్రామాణికం
ABN , Publish Date - Sep 30 , 2026 | 05:07 AM
ఎయిడెడ్, మైనారిటీ జూనియర్ కాలేజీల నుంచి ప్రభుత్వంలో విలీనం అయిన బోధన, బోధనేతర సిబ్బంది సర్వీసుపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.
బోధన, బోధనేతర సిబ్బంది ఇంటర్‌లో విలీన సర్వీసుపై ఉత్తర్వులు
అమరావతి, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): ఎయిడెడ్, మైనారిటీ జూనియర్ కాలేజీల నుంచి ప్రభుత్వంలో విలీనం అయిన బోధన, బోధనేతర సిబ్బంది సర్వీసుపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఆయా విద్యా సంస్థల నుంచి ప్రభుత్వంలో విలీనం అయిన రోజు నుంచే వారి సర్వీసు లెక్కింపు ప్రారంభమవుతుందని తెలిపింది. ఈ మేరకు ఇంటర్మీడియట్ సర్వీస్ రూల్స్‌కు సవరణ చేస్తూ పాఠశాల విద్యాశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 637 మంది బోధన, బోధనేతర సిబ్బంది ప్రభుత్వంలో విలీనం అయ్యారు. వారికి ఎప్పటి నుంచి సర్వీసును లెక్కించాలనే అంశంపై ఇంటర్ విద్యాశాఖ ప్రతిపాదనలు సమర్పించింది. ఈ ప్రతిపాదనలకు అనుగుణంగా ప్రభుత్వంలో చేరిన తేదీనే ప్రామాణికం అని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ వార్తలనూ చదవండి..
హై బీమ్ ఎల్‌ఈడీ లైట్లతో అగచాట్లు
వేర్వేరు ఘటనల్లో ఐదుగురి బలవన్మరణం