Share News

‘మన మిత్ర’లో కుల ధ్రువీకరణ పత్రాలు

ABN , Publish Date - Oct 08 , 2026 | 05:20 AM

‘మన మిత్ర’ - వాట్సప్‌ గవర్నెన్స్‌ ద్వారా పౌరులు కుల ధ్రువీకరణ పత్రాలను సలువుగా పొందవచ్చని రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ సొసైటీ(ఆర్టీజీఎస్‌) వెల్లడించింది.

‘మన మిత్ర’లో కుల ధ్రువీకరణ పత్రాలు

అమరావతి, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): ‘మన మిత్ర’ - వాట్సప్‌ గవర్నెన్స్‌ ద్వారా పౌరులు కుల ధ్రువీకరణ పత్రాలను సలువుగా పొందవచ్చని రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ సొసైటీ(ఆర్టీజీఎస్‌) వెల్లడించింది. ఈమేరకు బుధవారం ఆర్టీజీఎస్‌ ఒక ప్రకటన చేసింది. ఇక నుంచి కుల ధ్రువీకరణ పత్రాల కోసం రెవెన్యూ కార్యాలయానికి వెళ్లకుండా మొబైల్‌ ద్వారా పొందవచ్చని తెలిపింది. దీని కోసం వాట్సప్‌లో ‘మన మిత్ర’ నంబరును 9552300009 ఓపెన్‌ చేయాలి. హాయ్‌ అని మెసేజ్‌ చేయాలి. సేవను ఎంచుకోండి అన్న ఆప్షన్‌లో రెవెన్యూ సేవలను ఎంపిక చేసుకోవాలి.. డ్రాప్‌ డౌన్‌ విభాగంలో ‘ఇంటిగ్రేటెడ్‌ ధ్రువీకరణ పత్రం మళ్లీ జారీ’ అన్నదానిని ఎంచుకోవాలి. మీకు దయచేసి ‘ఫ్లోను తెరవండి’ అన్న సందేశం వస్తుంది. దానిని క్లిక్‌ చేసిన తరువాత ఆధార్‌ ధ్రువీకరణ కోసం మీ ఆధార్‌ నంబరును ఫీడ్‌ చేయమని అడుగుతుంది. ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్‌ చేస్తే దరఖాస్తుదారు వివరాలను అడుగుతుంది. దానిని పూర్తి చేస్తే సరి. దరఖాస్తు నింపిన తరువాత ఫీజు రూ.40 చెల్లించి కులధ్రువీకరణ పత్రాన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఆర్టీజీఎస్‌ తెలిపింది.

ఈ వార్తలనూ చదవండి..

రైతన్నకు ఊరటేదీ?

ప్రజల చెంతకు వైద్య సేవలు

Updated Date - Oct 08 , 2026 | 05:20 AM