బాలలతో ప్రచారంపై చైల్డ్ ప్రొటెక్షన్ కమిషన్ ఆగ్రహం
ABN , Publish Date - Oct 27 , 2026 | 05:28 AM
ఎన్నికల ప్రచారంలో బాలలను వినియోగించడంపై ఆంధ్రప్రదేశ్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఏపీ ఎస్‌సీపీసీఆర్) విచారణకు ఆదేశించింది. ఈ మేరకు గుంటూరు కలెక్టర్‌కు కమిటీ ఆదేశాలు జారీ చేసింది.
బాధ్యులపై క్రిమినల్ చర్యలకు ఆదేశం
గుంటూరు విద్య, 26(ఆంధ్రజ్యోతి): ఎన్నికల ప్రచారంలో బాలలను వినియోగించడంపై ఆంధ్రప్రదేశ్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఏపీ ఎస్‌సీపీసీఆర్) విచారణకు ఆదేశించింది. ఈ మేరకు గుంటూరు కలెక్టర్‌కు కమిటీ ఆదేశాలు జారీ చేసింది. ‘ఆంధ్రజ్యోతి’లో సోమవారం ‘చిన్నారులతో ఎన్నికల ప్రచారం’ శీర్షికన కథనం వెలువడింది. గుంటూరు 27వ డివిజన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వైసీపీ నాయకుడు బాలలతో ఎన్నికల ప్రచారం చేయించారు. ఇటువంటి చర్యలు జువైనల్ జస్టిస్ యాక్ట్ 2015, బాల కార్మిక చట్టం 1986కు చట్ట విరుద్ధమని, ఎన్నికల ప్రచారం చేయించిన రాజకీయ నాయకులపై క్రిమినల్, శిక్షార్హమైన చర్యలు తీసుకోవాలంటూ గుంటూరు జిల్లా కలెక్టర్‌కు కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.
ఈ వార్తలనూ చదవండి:
బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా బలపడిన ‘అర్నబ్’
అతి తీవ్ర తుఫాను..ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్