Share News

స్థానిక పోరులో హింసను సహించం

ABN , Publish Date - Oct 17 , 2026 | 04:45 AM

స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజే వైసీపీ అరాచకాలకు పాల్పడుతోందని, హింసను సహించే ప్రసక్తే లేదని బీజేపీ రాష్ట్ర చీఫ్‌ పీవీఎన్‌ మాధవ్‌ హెచ్చరించారు.

స్థానిక పోరులో హింసను సహించం

  • వైసీపీ అరాచకాలను కట్టడి చేస్తాం: మాధవ్‌

అమరావతి, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజే వైసీపీ అరాచకాలకు పాల్పడుతోందని, హింసను సహించే ప్రసక్తే లేదని బీజేపీ రాష్ట్ర చీఫ్‌ పీవీఎన్‌ మాధవ్‌ హెచ్చరించారు. ధర్మవరంలో బీజేపీ శ్రేణులపై, పుంగనూరు, రాయచోటి తదితర ప్రాంతాల్లో టీడీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడిన వైసీపీ తీరు ను తీవ్రంగా ఖండించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే శక్తులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో స్థానిక ఎన్నికలపై పార్టీ కమిటీతో శుక్రవారం ఆయన చర్చించారు. పోలింగ్‌ ముగిసే వరకు అప్రమత్తంగా ఉండాలని దిశా నిర్దేశం చేశారు. కాగా, రాష్ట్రంలో తమకు కేటాయించిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేశారు. వీరు శనివారం నామినేషన్‌ వేయనున్నారు.

ఈ వార్తలనూ చదవండి:

అంతా కొలిక్కి...

ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు

Updated Date - Oct 17 , 2026 | 04:45 AM