తిరుమల వ్యాపార కేంద్రం కాదు: నీలాయపాలెం
ABN , Publish Date - Oct 13 , 2026 | 05:23 AM
తిరుమలలో కర్ణాటక రాష్ట్ర సత్రాల సముదాయంలోని స్థలాన్ని ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణానికి ఆ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థకు ఆ రాష్ట్ర ప్రభుత్వం లీజుకు ఇవ్వడంపై ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయకుమార్ ఓ ప్రకటనలో అభ్యంతరం వ్యక్తం చేశారు.
అమరావతి, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): తిరుమలలో కర్ణాటక రాష్ట్ర సత్రాల సముదాయంలోని స్థలాన్ని ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణానికి ఆ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థకు ఆ రాష్ట్ర ప్రభుత్వం లీజుకు ఇవ్వడంపై ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయకుమార్ ఓ ప్రకటనలో అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘తిరుపతి జిల్లా పరిధిలోని ఈ ఆస్తిని ఏపీ దేవదాయ చట్టం ప్రకారం టీటీడీ బోర్డు అనుమతి లేకుండా మూడో సంస్థకు సబ్ లీజుకు ఇవ్వడం లేదా లాభాపేక్ష కలిగిన మోడల్‌ను ప్రవేశపెట్టడం నిబంధనలకు విరుద్ధం. కర్ణాటక ప్రభుత్వం స్టార్ హోటల్ నిర్మాణం, లీజు అంశాలపై పునరాలోచన చేయాలి. కర్ణాటక సత్రాల కాంప్లెక్స్‌ను ధర్మసత్రంగానే కొనసాగించాలి. వైసీపీ హయాంలో తిరుమలపై ఇలాంటి వ్యాపారీకరణ విధానాలకు బీజం పడింది’ అని నీలాయపాలెం విమర్శించారు.
ఈ వార్తలనూ చదవండి: