Share News

బీసీ యువతకు ఉచిత సివిల్స్‌ కోచింగ్‌

ABN , Publish Date - Oct 13 , 2026 | 04:30 AM

దేశంలోనే తొలిసారిగా పీ4 మోడల్‌లో బీసీ నిరుద్యోగ యువతకు ఉచిత సివిల్‌ సర్వీసెస్‌ కోచింగ్‌ ఇవ్వనున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి ఎస్‌.సవిత తెలిపారు.

బీసీ యువతకు ఉచిత సివిల్స్‌ కోచింగ్‌

అమరావతి, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): ఇందుకోసం ప్రఖ్యాతి గాంచిన డాక్టర్‌ లక్ష్మయ్య ఐఏఎస్‌ అకాడమీతో తమ శాఖ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. మెటీరియల్‌ ఉచితంగా ఇవ్వడంతోపాటు అభ్యర్థులకు నిష్ణాతులైన అధ్యాపకుల ద్వారా క్లాసులు నిర్వహించనున్నట్లు తెలిపారు. త్వరలోనే సివిల్స్‌ ఉచిత కోచింగ్‌ ప్రారంభించనున్నామని తెలిపారు. డీఎస్సీ నోటిఫికేషన్‌ రాగానే ఉచిత శిక్షణ ప్రారంభించనున్నామన్నారు. ఎస్‌ఐ, పోలీస్‌ కానిస్టేబుల్‌ పోటీ పరీక్షలకు కూడా ఉచిత శిక్షణ అందించనున్నట్లు మంత్రి సవిత తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి:

పెట్టుబడుల స్వర్గధామం ఏపీ

నాడు అడ్డగోలు.. నేడు గగ్గోలు

Updated Date - Oct 13 , 2026 | 04:30 AM