బార్ కౌన్సిల్ చైర్మన్ బాలాజీకి ఘన సన్మానం
ABN , Publish Date - Nov 13 , 2026 | 04:49 AM
రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ యలమంజుల బాలాజీని ప్రభుత్వ న్యాయవాదులు, సహాయ ప్రభుత్వ న్యాయవాదులు ఘనంగా సన్మానించారు. గురువారం హైకోర్టులో ఆయనను శాలువాలతో సత్కరించి పుష్పగుచ్ఛాలు అందజేశారు.
అమరావతి, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ యలమంజుల బాలాజీని ప్రభుత్వ న్యాయవాదులు, సహాయ ప్రభుత్వ న్యాయవాదులు ఘనంగా సన్మానించారు. గురువారం హైకోర్టులో ఆయనను శాలువాలతో సత్కరించి పుష్పగుచ్ఛాలు అందజేశారు. తమతో పాటు ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేస్తున్న ఆయన బార్ కౌన్సిల్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు.
కార్యక్రమంలో అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, అదనపు అడ్వొకేట్ జనరల్ సాంబశివప్రతాప్, ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదులు ప్రణతి, విష్ణుతేజ, ప్రభుత్వ న్యాయవాదులు కేఎం కృష్ణారెడ్డి, యాగంటి సుష్మ, తోట శ్రీనివాస రాయలు తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
విశాఖలో 31వ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్-2026 ప్రారంభం
ఏపీకి పెట్టుబడుల వరద.. తొలిరోజే రూ.1.57 లక్షల కోట్ల ఒప్పందాలు