Share News

24 వేల కోట్ల పెట్టుబడులకు ఎస్‌ఐపీసీ గ్రీన్‌సిగ్నల్‌

ABN , Publish Date - Oct 06 , 2026 | 04:58 AM

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పలు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. రాష్ట్రానికి కొత్తగా రూ.23,994.94 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయి. 11,289 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని ఆ సంస్థలు తెలిపాయి.

24 వేల కోట్ల పెట్టుబడులకు ఎస్‌ఐపీసీ గ్రీన్‌సిగ్నల్‌

  • 11 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే ప్రతిపాదనలు

అమరావతి, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పలు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. రాష్ట్రానికి కొత్తగా రూ.23,994.94 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయి. 11,289 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని ఆ సంస్థలు తెలిపాయి. ఈ ప్రతిపాదనలకు వెలగపూడి సచివాలయంలో సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ (ఎస్‌ఐపీసీ) ఆమోదం తెలిపింది.

ఎస్‌ఐపీసీ ఆమోదం పొందినవి

  • ఎన్టీఆర్‌ జిల్లా తాడువాయిలో ఆంధ్రా షుగర్స్‌ రూ.57 కోట్లతో రోజుకు పది టన్నుల సామర్థ్యం ఉన్న కంప్రెస్డ్‌ బయోగ్యాస్‌ ప్లాంట్‌ను స్థాపిస్తుంది. 1,040 మందికి ఉద్యోగాలను కల్పిస్తుంది.

  • చిత్తూరు జిల్లా విజయపురంలో ఐరా బయోటెక్‌ 78 కోట్లతో 526 మందికి ఉద్యోగాలు ఇస్తుంది. రోజుకు12 టన్నుల కంప్రెస్డ్‌ బయోగ్యాస్‌ ప్లాంటు ఏర్పాటు చేస్తుంది.

  • నంద్యాల జిల్లా ఉడుమల్లిపురంలో ఐరా బయోఎనర్జీ రూ.60 కోట్లతో రోజుకు 12 టన్నుల కంప్రెస్డ్‌ బయో గ్యాస్‌ ప్లాంటు ఏర్పాటు చేస్తుంది. 200 మందికి ఉద్యోగాలు కల్పిస్తుంది.


  • స్కై రిట్రీట్స్‌ రూ.75 కోట్లతో 300 మందికి ఉద్యోగాలు కల్పించే సంస్థను అనంతపురంలో ఏర్పాటు చేయనుంది.

  • కాకినాడలో మన్‌ప్రకాశ్‌ గ్రూప్‌ రూ.64.63 కోట్లతో హోటల్‌ నిర్మిస్తుంది. 240 మందికి ఉద్యోగాలు ఇస్తుంది.

  • విజయనగరంలో స్టీల్‌ ఎక్స్ఛేంజి ఆఫ్‌ ఇండియా రూ.5,194 కోట్లతో 1,239 మందికి ఉద్యోగాలు కల్పించే పరిశ్రమను ఏర్పాటు చేస్తుది.

  • కర్నూలులో రూ.2,700 కోట్లతో రామసన్స్‌ సోలార్‌ 1,239 మందికి ఉద్యోగాలు ఇచ్చే ప్లాంటు ఏర్పాటు చేస్తుంది.

  • శ్రీసత్యసాయి జిల్లాలో హెచ్‌టీఎల్‌ మెటల్‌ రూ. 102 కోట్లతో 275 మందికి ఉద్యోగాలు ఇస్తుంది.

  • తిరుపతిలో సిరవిట్‌ సిరామిక్స్‌ రూ.240 కోట్లతో 400 మందికి ఉద్యోగాలను కల్పిస్తుంది.

  • శ్రీసిమెంట్‌ కడప జిల్లా జమ్మలమడుగులో రూ. 7,167 కోట్లతో1,102 మందికి ఉద్యోగాలు ఇస్తుంది.

  • జయ్‌రాజ్‌ ఇస్పాత్‌ లిమిటెడ్‌ ఓర్వకల్లులో రూ. 3,378 కోట్లతో 934 మందికి ఉద్యోగాలు ఇస్తుంది.

  • నెల్లూరు జిల్లాలో సన్‌షైన్‌ పరిశ్రమ రూ.466 కోట్లతో 300 మందికి ఉద్యోగాలు ఇస్తుంది.

  • నెల్లూరు జిల్లాలో రూ. 269 కోట్లతో 250 మందికి ఉద్యోగాలను కల్పించే డిఫెన్స్‌ పరిశ్రమను మనీష్‌ డిఫెన్స్‌ సొల్యూషన్స్‌ స్థాపిస్తుంది.

  • విశాఖపట్నంలో రూ.770 కోట్లతో 500 మందికి ఉద్యోగాలను కల్పించేందుకు పరశురాం ఇండస్ట్రియల్‌ పార్కు ముందుకు వచ్చింది.

ఈ వార్తలనూ చదవండి:

ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం.. ఉద్యోగుల శిక్షణపై సీఎం స్పెషల్ ఫోకస్

ఏపీలో నాలుగు కొత్త పోలీస్‌ కమిషనరేట్ల ఏర్పాటు.. జీవో జారీ చేసిన ప్రభుత్వం

Updated Date - Oct 06 , 2026 | 05:00 AM