Share News

కర్నూలు జిల్లాలో 500 మెగావాట్ల పవన విద్యుత్తు ప్రాజెక్టు

ABN , Publish Date - Nov 11 , 2026 | 04:43 AM

కర్నూలు జిల్లాలో 500 మెగావాట్ల పవన విద్యుత్తు ప్రాజెక్టుకు అనుమతిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మిగనూరు మండలంలో విండోరా ఎనర్జీ ప్రైవేటు లిమిటెడ్‌ ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయనుంది.

కర్నూలు జిల్లాలో 500 మెగావాట్ల పవన విద్యుత్తు ప్రాజెక్టు

అమరావతి, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లాలో 500 మెగావాట్ల పవన విద్యుత్తు ప్రాజెక్టుకు అనుమతిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మిగనూరు మండలంలో విండోరా ఎనర్జీ ప్రైవేటు లిమిటెడ్‌ ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయనుంది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలో రోజుకు 10టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో కంప్రెస్డ్‌ బయోగ్యాస్‌ ప్లాంట్‌(సీబీజీ ప్లాంట్‌) ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. అలాగే చిత్తూరు జిల్లా విజయపురం మండలంలో రోజుకు 12టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో సీబీజీ ప్లాంటును ఏర్పాటుకి ఐరా బయోఎనర్జీకి ప్రభుత్వం అనుమతిచ్చింది.

ఈ వార్తలనూ చదవండి:

విశాఖ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ సేవల రద్దు

30 ఏళ్లు దాటినా రాజీవ్ గాంధీ భౌతికకాయం ఫొటో చూడని సోనియా!

Updated Date - Nov 11 , 2026 | 04:45 AM