కృష్ణాకు జెడ్పీ సీఈఓ, తిరుపతికి డిప్యూటీ సీఈఓలు
ABN , Publish Date - Oct 15 , 2026 | 05:31 AM
స్థానికసంస్థల ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లాకు జెడ్పీ సీఈఓను, తిరుపతి జిల్లాకు డిప్యూటీ సీఈఓను నియమించారు. ఎస్ఆర్డీఎ్సలో డిప్యూటీ డైరెక్టర్గా ఉన్న మోమిడి శ్రీహరిని...
అమరావతి, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): స్థానికసంస్థల ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లాకు జెడ్పీ సీఈఓను, తిరుపతి జిల్లాకు డిప్యూటీ సీఈఓను నియమించారు. ఎస్ఆర్డీఎ్సలో డిప్యూటీ డైరెక్టర్గా ఉన్న మోమిడి శ్రీహరిని కృష్ణా జిల్లా జెడ్పీ సీఈఓగా నియమించి, అక్కడ పనిచేస్తున్న జె.అరుణను ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. అదే విధంగా టూరిజం డెవల్పమెంట్ కార్పొరేషన్లో రీజినల్ డైరెక్టర్గా పనిచేస్తున్న డీడీఓ ఆర్.రమణ ప్రసాద్ను తిరుపతి డిప్యూటీ సీఈఓగా నియమిస్తూ ఆదేశాలిచ్చారు. స్థానిక ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియలో కృష్ణా జిల్లా జెడ్పీ సీఈఓ అరుణపై పలు ఆరోపణలు రావడంతో వేటువేసినట్టు సమాచారం.
ఈ వార్తలనూ చదవండి:
ఆటోమేటిక్ వర్క్ పర్మిట్ ఎక్స్టెన్షన్ రద్దు.. అమెరికా ప్రభుత్వం వెల్లడి
హోర్ముజ్ జలసంధిలో మైన్ను ఢీకొని కార్గో నౌక మునక..