Share News

అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి 1 నుంచి ‘ఆక్యుపై ఢిల్లీ’

ABN , Publish Date - Nov 13 , 2026 | 04:44 AM

అంగన్వాడీల సమస్యల పరిష్కారానికై డిసెంబరు 1, 2, 3 తేదీల్లో ఢిల్లీలో జరిగే ‘ఆక్యుపై ఢిల్లీ’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఏపీ అంగన్వాడీ వర్కర్‌, ...

అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి 1 నుంచి ‘ఆక్యుపై ఢిల్లీ’

అమరావతి, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): అంగన్వాడీల సమస్యల పరిష్కారానికై డిసెంబరు 1, 2, 3 తేదీల్లో ఢిల్లీలో జరిగే ‘ఆక్యుపై ఢిల్లీ’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఏపీ అంగన్వాడీ వర్కర్‌, హెల్పర్స్‌ యూనియన్‌ పిలుపునిచ్చింది. రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బేబిరాణి, సుబ్బరావమ్మ గురువారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మికులకు నష్టం చేసే లేబర్‌ కోడ్‌ల రద్దు, అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు, కనీస వేతనం రూ.42 వేలు, పెన్షన్‌, పీఎఫ్‌, ఈఎ్‌సఐ, గ్రాట్యుటీ అమలు చేయాలనే డిమాండ్‌తో ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు కోరారు.

ఈ వార్తలనూ చదవండి:

విశాఖలో 31వ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్-2026 ప్రారంభం

ఏపీకి పెట్టుబడుల వరద.. తొలిరోజే రూ.1.57 లక్షల కోట్ల ఒప్పందాలు

Updated Date - Nov 13 , 2026 | 04:44 AM