ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్‌గా ఏపీ
ABN , Publish Date - Sep 30 , 2026 | 05:41 AM
కేంద్ర ప్రభుత్వ సహకారంతో... సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిశానిర్దేశంలో ఆంధ్రప్రదేశ్‌ను ఎకనామిక్ గ్రోత్ ఇంజన్‌గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు.
పర్యాటక రంగంలో 20 వేల కోట్ల పెట్టుబడులు
వైసీపీకి క్రెడిట్ చోరీ అలవాటు: మంత్రి దుర్గేశ్
రాజమహేంద్రవరం, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ సహకారంతో... సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిశానిర్దేశంలో ఆంధ్రప్రదేశ్‌ను ఎకనామిక్ గ్రోత్ ఇంజన్‌గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో పర్యాటక రంగం అభివృద్ధి కోసం రెండున్నరేళ్లలోనే రూ.20వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని, పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా సాధించామని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమి పార్టీల్లో కొందరి అభిప్రాయాలు భిన్నమైనా తామంతా ఒకటే గొడుగు కింద ప్రజా శ్రేయస్సు కోసం పనిచేస్తున్నామని చెప్పారు. రాజమహేంద్రవరానికి మణిహారం, వందలాది మందికి ఉపాధి కల్పించే అఖండ గోదావరి ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం సాస్కి పథకం కింద రూ.94.44 కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు. ఇప్పటికే 60 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఇవేమీ పట్టని వైసీపీ పెద్దలు, నాయకులు ప్రతి విషయం మాదిరిగానే ఈ ప్రాజెక్టు విషయంలోనూ క్రెడిట్ చోరీకి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. వైసీపీకి క్రెడిట్ చోరీ అలవాటుగా మారిందన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో జరిగిన పర్యాటకాభివృద్ధి.. కూటమి ప్రభుత్వం వచ్చాక రెండున్నరేళ్లలోనే జరిగిన పర్యాటకాభివృద్ధిపై చర్చకు సిద్ధమా..? అని మంత్రి దుర్గేశ్ నిలదీశారు.
ఈ వార్తలనూ చదవండి..
హై బీమ్ ఎల్‌ఈడీ లైట్లతో అగచాట్లు
వేర్వేరు ఘటనల్లో ఐదుగురి బలవన్మరణం