రైతు సంక్షేమంపై బహిరంగ చర్చకు రావాలి
ABN , Publish Date - Oct 12 , 2026 | 05:00 AM
రైతులను ఆదుకునేందుకు మార్కెట్ జోక్యం, మద్దతు ధరకు ఉత్పత్తుల సేకరణ, కొనుగోళ్లకు సకాలంలో చెల్లింపులకు నిధుల విడుదల వంటి అంశాలను దాచి పెట్టి,..
జగన్‌కు మంత్రి అచ్చెన్న సవాల్
అమరావతి, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): రైతులను ఆదుకునేందుకు మార్కెట్ జోక్యం, మద్దతు ధరకు ఉత్పత్తుల సేకరణ, కొనుగోళ్లకు సకాలంలో చెల్లింపులకు నిధుల విడుదల వంటి అంశాలను దాచి పెట్టి, కూటమి ప్రభుత్వంపై అసత్యప్రచారం చేయడం జగన్‌కు, ఆయన మీడియాకు అలవాటుగా మారిందని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఐదేళ్ల వైసీపీ పాలన, రెండున్నరేళ్ల కూటమి పాలనలో రైతుకు జరిగిన మేలుపై జగన్ బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. ఈ మేరకు ఆదివారం అచ్చెన్నాయుడు ఓ ప్రకటన చేశారు. ‘2024-25 ఖరీఫ్ నుంచి 2025-26 రబీ వరకు 1,50,747 మంది రైతుల నుంచి రూ.2,84,045 టన్నుల పంట ఉత్పత్తులను కొనుగోలు చేయగా, రైతులకు నగదు చెల్లింపుల కోసం రూ.1,944.43కోట్లు విడుదలయ్యాయి. కందులు, శనగలు, మినుములు, పెసలు, ఉల్లి, పొగాకు కొనుగోళ్ల వివరాలు మార్క్‌ఫెడ్‌లో ఉన్నా, ప్రభుత్వం ఏమీ చేయలేదన్నట్లు చిత్రీకరించడం వెనుక జగన్ పత్రిక ఉద్దేశం ఏమిటి? వాస్తవాలను తొక్కిపెట్టి, అవాస్తవాలు ప్రచారంచేస్తే సహించేది లేదు అని హెచ్చరించారు.
ఈ వార్తలనూ చదవండి...
నెల్లూరులో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు
రాయలసీమ అభివృద్ధి సభలో రాజకీయాలు వద్దు: పవన్ కల్యాణ్