ఏకగ్రీవం వద్దు.. పోటీయే ముద్దు!
ABN , Publish Date - Nov 13 , 2026 | 01:57 AM
తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం తీపర్రు పంచాయతీ ఎన్నికల్లో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. పోటీ వద్దని ఏకగీవ్రంగా ..
పెరవలి, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం తీపర్రు పంచాయతీ ఎన్నికల్లో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. పోటీ వద్దని ఏకగీవ్రంగా చేసుకుందామని, సర్పంచి పదవి ఇస్తామని ఒక వర్గం మరో వర్గానికి ప్రతిపాదించారు. అయితే ఆ వర్గం వారు తాము ఏకగ్రీవానికి అంగీకరించమని, ఆ పదవి తీసుకోబోమని తిరస్కరించారు. పోటీ చేసి గెలిస్తేనే తమ సత్తా ఏమిటో తెలుస్తుందని పేర్కొంటూ ఆ ప్రతిపాదనను నిరాకరించారు. దీంతో ఇరువైపులా గట్టి అభ్యర్థులను పోటీలోకి దింపడంతో పోటీ రసవత్తరంగా మారింది.
ఈ వార్తలనూ చదవండి:
విశాఖలో 31వ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్-2026 ప్రారంభం
ఏపీకి పెట్టుబడుల వరద.. తొలిరోజే రూ.1.57 లక్షల కోట్ల ఒప్పందాలు