పరిస్థితులకు తగిన నైపుణ్యాలను విద్యార్థులు పెంచుకోవాలి: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
ABN , Publish Date - Apr 27 , 2026 | 07:47 PM
ఆంధ్రా యూనివర్సిటీ శతాబ్ది మహోత్సవాల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. పరిస్థితులకు తగినట్టు విద్యార్థులు కొత్త నైపుణ్యాలను అలవర్చుకోవాలని సూచించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఆంధ్రా విశ్వవిద్యాలయం శతాబ్ది మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ తదితరలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ విశ్వవిద్యాలయాలు పరిశోధన కేంద్రాలుగా మారాలని అన్నారు. పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని పరిశోధనలు చేయాలని సూచించారు. యువతే దేశ భవిత అని ఆయన అన్నారు. ఆరోగ్యకరమైన, క్రమశిక్షణతో కూడిన జీవన శైలిని యువత అలవాటు చేసుకోవాలని సూచించారు. కన్న తల్లి, జన్మ భూమి, పాఠాలు చెప్పిన గురువులను, మాతృ భాషను మర్చిపోకూడదని సూచించారు. తెలుగు భాష ప్రజలకు వెలుగు అని వ్యాఖ్యానించారు. ఇష్టపడిన పనిని కష్టపడి చేస్తే నష్టపడేది ఉండదని అన్నారు.
రాష్ట్రంలో ఏయూను స్థాపించేందుకు అనేక మంది కృషి చేశారని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా తెలిపారు. తొలి వీసీ కట్టమంచి ఈ యూనివర్సిటీకి బలమైన పునాదులు వేశారని అన్నారు. రెండో వీసీ సర్వేపల్లి రాధాకృష్ణన్ రాష్ట్రపతిగా ఎదిగారని గుర్తు చేశారు. ఏయూలో 58 దేశాల విద్యార్థులు చదువుతున్నారని అన్నారు. తెలుగు భాషా వైభవానికి కూడా ఏయూ కృషి చేస్తోందని చెప్పారు.
ఈ వార్తలనూ చదవండి:
కృషి, పట్టుదల ఉంటే అన్నీ సాధ్యమే: ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్
దేశంలోని అనేక యూనివర్సిటీలకు ఏయూనే దిక్సూచి: సీఎం చంద్రబాబు