Share News

పల్లె పల్లెనా సందడి

ABN , Publish Date - Nov 13 , 2026 | 01:53 AM

పల్లెసీమల్లో ఎన్నికల వేడి పెరిగింది. పంచాయతీ సర్పంచ్‌ పదవులను ఏకగ్రీవంగా దక్కించుకునేందుకు ఆశావహులు రకరకాల హామీలు గుప్పిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో ఏకంగా వేలంపాటలే నిర్వహిస్తున్నారు.

పల్లె పల్లెనా సందడి

  • సర్పంచ్‌గిరీ ఏకగ్రీవాల కోసం పోటాపోటీ

  • గ్రామానికి రూ.కోటికి పైగా ఇచ్చేందుకూ ఆశావహులు సిద్ధం

  • కొన్ని చోట్ల ఆలయాల అభివృద్ధికి హామీలు

  • ఇంకొన్ని చోట్ల ‘వంతెన’ వాగ్దానాలు

  • మరికొన్ని చోట్ల పోటీకే మొగ్గు

  • దుర్గాడలో రూ.1.20 కోట్లకు..

  • దుళ్లలో రూ.కోటిన్నర వరకు..

  • తన తల్లిని ఎన్నుకుంటే రూ.కోటి ఇస్తానంటున్న బండారులంక టెకీ

పల్లెసీమల్లో ఎన్నికల వేడి పెరిగింది. పంచాయతీ సర్పంచ్‌ పదవులను ఏకగ్రీవంగా దక్కించుకునేందుకు ఆశావహులు రకరకాల హామీలు గుప్పిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో ఏకంగా వేలంపాటలే నిర్వహిస్తున్నారు. వేలం ధర రూ.కోటి దాటుతోంది. మరికొన్ని చోట్ల గ్రామాభివృద్ధికి అవసరమైన వాగ్దానాలు చేసి.. ప్రజల మెప్పు పొంది.. పోటీ లేకుండా ఎన్నికయ్యేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. ఇంకొన్ని గ్రామాల్లో.. పోటీచేసి గెలిచి తమ సత్తా నిరూపించుకోవాలని నేతలు పట్టుదల ప్రదర్శిస్తున్నారు.

ఓ గ్రామంలోని ఆలయాల అభివృద్ధికి ఎవరు ఎక్కువ డబ్బులిస్తారో వారికే ఏకగ్రీవంగా మద్దతిస్తామని గ్రామపెద్దలు తీర్మానించారు. జనసేన నాయకుడొకరు రూ.1.20 కోట్లివ్వడానికి సంసిద్ధత తెలిపారు. అయితే ఆయనకు అదే పార్టీ నేత నుంచి పోటీ ఎదురైంది. ఆ రూ.1.20 కోట్లూ తానే ఇస్తానని అనడంతో గ్రామ పెద్దలు డైలమాలో పడ్డారు. ఎవరు ఎక్కువ డబ్బులిస్తే వారికే పదవి దక్కే అవకాశం ఉంది. ఇంకో గ్రామంలో ఓ నేత.. తనను సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే.. అత్యవసర వంతెన నిర్మాణానికయ్యే ఖర్చంతా భరిస్తానన్నారు.

మరో ఊర్లో తన తల్లిని సర్పంచ్‌గా ఏకగ్రీవంగా గెలిపిస్తే గ్రామాభివృద్ధికి రూ.కోటి ఇస్తానని ఓ నాయకుడు ప్రకటించారు. ఇలా రకరకాల మార్గాల్లో పదవులు తమకో, తమ కుటుంబ సభ్యులకో దక్కించుకోవడానికి ఆశావహులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. అయితే ఎక్కువ చోట్ల ప్రజాస్వామ్యబద్ధంగానే ఎన్నికల బరిలోకి దిగి నెగ్గాలని నేతలు భావిస్తున్నారు.

ఈ వార్తలనూ చదవండి:

విశాఖలో 31వ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్-2026 ప్రారంభం

ఏపీకి పెట్టుబడుల వరద.. తొలిరోజే రూ.1.57 లక్షల కోట్ల ఒప్పందాలు

Updated Date - Nov 13 , 2026 | 03:21 AM