పేదల గృహ నిర్మాణంలో ఏపీ ఫస్ట్
ABN , Publish Date - Oct 06 , 2026 | 05:25 AM
పేదల గృహ నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన విధానాలకు జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది. ‘పీఎం ఆవాస్ యోజన(అర్బన్)-2.0 అవార్డులు -2026’లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన రాష్ట్రాల కేటగిరీలో ఏపీ జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది.
జాతీయ పురస్కారాన్ని అందుకున్న హౌసింగ్ సెక్రటరీ
అమరావతి, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): పేదల గృహ నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన విధానాలకు జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది. ‘పీఎం ఆవాస్ యోజన(అర్బన్)-2.0 అవార్డులు -2026’లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన రాష్ట్రాల కేటగిరీలో ఏపీ జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రపంచ ఆవాస దినోత్సవం సందర్భంగా సోమవారం న్యూఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి టోఖన్ సాహు చేతుల మీదుగా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి హెప్సిబారాణి కొర్లపాటి రాష్ట్ర ప్రభుత్వం తరపున అవార్డును అందుకున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం.. ఉద్యోగుల శిక్షణపై సీఎం స్పెషల్ ఫోకస్
ఏపీలో నాలుగు కొత్త పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటు.. జీవో జారీ చేసిన ప్రభుత్వం