ఉత్తరాంధ్ర జిల్లాలకు అలర్ట్! రానున్న మూడు రోజుల్లో..
ABN , Publish Date - Mar 15 , 2026 | 08:39 PM
ఉత్తరాంధ్ర జిల్లాల్లో రానున్న మూడు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉండటంతో అలర్ట్ జారీ అయ్యింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల క్రింద నిలబడరాదని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరాంధ్ర జిల్లాల్లో రానున్న మూడు రోజుల్లో ఓవైపు ఎండలు, మరోవైపు మేఘావృతమైన ఆకాశంతో విభిన్న వాతావరణం నెలకొంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు అలర్ట్ జారీ అయ్యింది. నైరుతి దిశ నుంచి వీచే గాలుల ప్రభావంతో రేపు, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసేందుకు అవకాశం ఉంది. ఇక ఆకస్మిక వర్షాలతో పడే పిడుగుపాటు విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద నిలబడరాదని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది.
ఇవి కూడా చదవండి..
ఇరాన్ అణు కేంద్ర నగరంపై దాడులు.. విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్
పుట్టా మహేశ్ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలి: సీపీఎం