జనాభా లెక్కల సేకరణపై రేపు రాష్ట్ర స్థాయి సమావేశం
ABN , Publish Date - Oct 08 , 2026 | 05:52 AM
జనాభా లెక్కల సేకరణ 2027లో భాగంగా రెండవ విడత పాపులేషన్ ఎన్యుమరేషన్ ప్రక్రియకు సంబంధించి ఈ నెల 9న శుక్రవారం అమరావతి సచివాలయంలో రాష్ట్ర స్థాయి సమావేశం జరగనున్నట్లు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (జీపీఎం అండ్‌ఎఆర్) ఎస్‌ఎస్ రావత్ తెలిపారు.
అమరావతి, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): జనాభా లెక్కల సేకరణ 2027లో భాగంగా రెండవ విడత పాపులేషన్ ఎన్యుమరేషన్ ప్రక్రియకు సంబంధించి ఈ నెల 9న శుక్రవారం అమరావతి సచివాలయంలో రాష్ట్ర స్థాయి సమావేశం జరగనున్నట్లు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (జీపీఎం అండ్‌ఎఆర్) ఎస్‌ఎస్ రావత్ తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ అధ్యక్షతన జరిగే ఈ ఒక రోజు రాష్ట్ర స్థాయి సమావేఏశంలో రాష్ట్ర సెన్సెస్ డైరెక్టర్ సహా ఇతర అధికారులు, రాష్ట్ర స్థాయి సెన్సెస్ కో ఆర్డినేషన్ కమిటీకి సంబంధించి ఆయా శాఖల కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెన్సెస్ అధికారులైన జిల్లా కలెక్టర్లు, వారితోపాటు జేసీ లేదా డీఆర్‌వో స్థాయి అధికారి, మున్సిపల్ కమిషనర్లు లేదా అదనపు, డిప్యూటీ కమిషనర్లు పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశంలో రెండవ విడత పాపులేషన్ ఎన్యుమరేషన్ ప్రక్రియకు సంబంధించి సన్నాహక చర్యలు ఇతర అంశాలపై చర్చించనున్నట్లు రావత్ తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి..