Share News

త్వరలో పబ్లిక్‌ లిటిగేషన్‌ పాలసీ ముసాయిదా!

ABN , Publish Date - Oct 08 , 2026 | 05:57 AM

రాష్ట్ర ప్రజా వ్యాజ్య విధానం(ఏపీ స్టేట్‌ పబ్లిక్‌ లిటిగేషన్‌ పాలసీ) విధి విధానాల ఖరా రు కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం బుధవారం అమరావతి సచివాలయంలో భేటీ అయింది.

త్వరలో పబ్లిక్‌ లిటిగేషన్‌ పాలసీ ముసాయిదా!

  • సిద్ధం చేయాలని మంత్రివర్గ ఉప సంఘం భేటీలో నిర్ణయం

అమరావతి, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రజా వ్యాజ్య విధానం(ఏపీ స్టేట్‌ పబ్లిక్‌ లిటిగేషన్‌ పాలసీ) విధి విధానాల ఖరా రు కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం బుధవారం అమరావతి సచివాలయంలో భేటీ అయింది. మంత్రులు ఎన్‌ఎండీ ఫరూక్‌, నాదెండ్ల మనోహర్‌ ప్రత్యక్ష్యంగా, అనిత, అనగాని సత్య ప్రసాద్‌, సత్యకుమార్‌లు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు. న్యాయశాఖ ఉన్నతాధికారులతో విస్తృతంగా చర్చించారు. ఇతర రాష్ట్రాల్లో అమలుకు సంబంధించిన విధానాలను ఉపసంఘం దృష్టికి తీసుకొచ్చారు. ఇతర రాష్ట్రాల్లో పర్యటించి అక్కడ అమలవుతున్న పబ్లిక్‌ లిటిగేషన్‌ పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలను న్యాయశాఖ కార్యదర్శి ప్రతిభాదేవి వివరించారు. న్యాయశాఖా మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ మాట్లాడుతూ.. న్యాయశాఖలో అనవసర వ్యాజ్యాలను తగ్గించడం, ప్రత్యామ్నాయ వివాద పరిష్కార ఫోరంలను ఏర్పాటు చేయడానికి అనుగుణంగా ‘ఏపీ రాష్ట్ర ప్రజా వ్యాజ్య విధానాన్ని’ త్వరలోనే రూపొందిస్తామని వెల్లడించారు. ప్రభుత్వ శాఖల్లో పెండింగ్‌ కోర్టు కేసుల పరిష్కా రంపై ప్రత్యేకంగా దృష్టి సారించడమే కాకుండా, అమలు కోసం ప్రత్యేక పర్యవేక్షణ కమిటీలు, నోడల్‌ అధికారులు, ఆన్‌లైన్‌ పోర్టల్‌ ఏర్పాటుకు సంబంధించి దృష్టి సారించాలన్నారు.

ఈ వార్తలనూ చదవండి..

రైతన్నకు ఊరటేదీ?

ప్రజల చెంతకు వైద్య సేవలు

Updated Date - Oct 08 , 2026 | 05:57 AM