కొత్తగా 22 డయాలసిస్ కేంద్రాలు: సత్యకుమార్
ABN , Publish Date - Oct 14 , 2026 | 05:26 AM
కిడ్నీ వ్యాధిగ్రస్తులకు వైద్య సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో రాష్ట్రంలో ప్రధాన మంత్రి జాతీయ డయాలసిస్ కార్యక్రమం కింద కొత్తగా మరో 22 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు..
అమరావతి, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): కిడ్నీ వ్యాధిగ్రస్తులకు వైద్య సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో రాష్ట్రంలో ప్రధాన మంత్రి జాతీయ డయాలసిస్ కార్యక్రమం కింద కొత్తగా మరో 22 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. రోగుల అవసరాలు, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని వీటిని ఏర్పాటు చేస్తున్నట్టు మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు.
రాష్ట్రంలో పీఎంఎన్డీపీ కింద ఇప్పటికే 61 కేంద్రాలు పని చేస్తున్నాయని తెలిపారు. వీటికి అదనంగా మరో 22 ఏర్పాటు చేస్తున్నామని, ఇవికాకుండా వైద్య సేవ ట్రస్ట్ ద్వారా 170 కేంద్రాలు పనిచేస్తున్నాయని తెలిపారు. ఈ రెండు పథకాల కింద ఉచితంగా అందించే డయాలసిస్ సేవల నిమిత్తం 2025-26లో రూ.197.88 కోట్ల వరకు ఖర్చు పెట్టామని చెప్పారు.
ఈ వార్తలనూ చదవండి:
గిన్నిస్ బుక్లోకి 75 గంటల డప్పుమోత