ఇద్దరు సీఈఓల సస్పెన్షన్
ABN , Publish Date - Oct 14 , 2026 | 06:00 AM
ప్రభుత్వ ఉత్తర్వులను ఖాతరు చేయని ఇద్దరు జెడ్పీ సీఈఓలపై వేటుపడింది. రాష్ట్రంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ భారీగా పదోన్నతులు కల్పించి ఆయా జిల్లాల్లో పలువురు డీడీఓలకు జెడ్పీ సీఈఓలుగా పోస్టింగ్లు ఇచ్చింది.
పోస్టింగ్ ఉత్తర్వులిచ్చినా ఖాతరు చేయకపోవడంతో సీరియస్
అమరావతి, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉత్తర్వులను ఖాతరు చేయని ఇద్దరు జెడ్పీ సీఈఓలపై వేటుపడింది. రాష్ట్రంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ భారీగా పదోన్నతులు కల్పించి ఆయా జిల్లాల్లో పలువురు డీడీఓలకు జెడ్పీ సీఈఓలుగా పోస్టింగ్లు ఇచ్చింది. ఈ క్రమంలో కొత్త జిల్లాల్లో సీఈఓలను నియమించింది. అయితే పోలవరం జెడ్పీ సీఈఓగా కె.కిశోర్కుమార్ను, నంద్యాల జెడ్పీ సీఈఓగా పి.ఊర్మిళాదేవీని నియమించగా వారు విధుల్లో చేరలేదు. దీనిని పంచాయతీరాజ్ శాఖ సీరియస్ తీసుకుంది. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోని జెడ్పీ సీఈఓలపై వేటు వేయాలని నిర్ణయం తీసుకుంది. వారిద్దరిని సస్పెండ్ చేస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీచేసింది.
ఈ వార్తలనూ చదవండి:
గిన్నిస్ బుక్లోకి 75 గంటల డప్పుమోత