పార్టీలకు గుర్తుల కేటాయింపునకు ఎస్ఈసీ నోటిఫికేషన్
ABN , Publish Date - Oct 16 , 2026 | 05:05 AM
రాష్ట్రంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు, ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీలతో పాటు రిజిస్టర్డ్ పార్టీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో గుర్తుల కేటాయింపుపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ గురువారం నోటిఫికేషన్ జారీచేసింది.
అమరావతి, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు, ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీలతో పాటు రిజిస్టర్డ్ పార్టీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో గుర్తుల కేటాయింపుపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ గురువారం నోటిఫికేషన్ జారీచేసింది. గుర్తింపు పొందని పార్టీలకు రిజర్వు చేసిన గుర్తులు లేనప్పుడు కమిషన్ ఆమోదించిన ఇతర గుర్తులు వినియోగించుకునేందుకు వీలుగా జాబితాను ప్రకటించింది. మేయర్, వార్డు సభ్యులకు సంబంధించి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు గతంలో జారీచేసిన గుర్తులే అమల్లోకి వస్తాయని పేర్కొంది. గత ఎన్నికల్లో మాదిరిగా బ్యాలెట్ పత్రంలో నోటా గుర్తు చేర్చారు.
ఈ వార్తలనూ చదవండి:
మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేయడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు