పాఠశాలలు, జూనియర్ కాలేజీలకు నేటి నుంచి దసరా సెలవులు
ABN , Publish Date - Oct 10 , 2026 | 05:27 AM
రాష్ట్రంలోని పాఠశాలలు, జూనియర్ కాలేజీలకు శనివారం నుంచి దసరా సెలవులు ప్రారంభం అవుతున్నాయి. ఇంటర్మీడియట్ కాలేజీలకు ఈనెల 10వ తేదీ నుంచి 20 వరకు దసరా సెలవులు ఇస్తున్నట్లు ...
స్కూళ్లకు కలిసొచ్చిన రెండో శనివారం, ఆదివారం
అకడమిక్ క్యాలెండర్ కంటే రెండ్రోజుల ముందే సెలవులు
సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు: ఇంటర్ విద్యామండలి
అమరావతి, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పాఠశాలలు, జూనియర్ కాలేజీలకు శనివారం నుంచి దసరా సెలవులు ప్రారంభం అవుతున్నాయి. ఇంటర్మీడియట్ కాలేజీలకు ఈనెల 10వ తేదీ నుంచి 20 వరకు దసరా సెలవులు ఇస్తున్నట్లు ఇంటర్ విద్యా మండలి ప్రకటించింది. ఇందులో ఒక రెండో శనివారం, రెండు ఆదివారాలు కూడా ఉన్నాయి. అకడమిక్ క్యాలెండర్ ప్రకారమే సెలవులు ఇస్తున్నట్లు మండలి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు, రెసిడెన్షియల్, కేజీబీవీ, హైస్కూల్ ప్లస్, సాంఘిక, గిరిజన, మోడల్ స్కూల్స్‌కు ఇది వర్తిస్తుందని వివరించింది. సెలవుల్లో ఏ కాలేజీలు తరగతులు నిర్వహించకూడదని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. అలాగే పాఠశాలలకు కూడా శనివారం నుంచే దసరా సెలవులు మొదలవుతున్నాయి. స్కూళ్లకు రెండో శనివారం, ఆదివారం కలిసొచ్చాయి. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం 12 నుంచి 21వ తేదీ వరకు పాఠశాలలకు దసరా సెలవులు ఇవ్వాలి. రెండో శనివారం, ఆదివారం రావడంతో 10వ తేదీ నుంచే పాఠశాలలకు దసరా సెలవులు ప్రారంభమవుతున్నాయి.
ఈ వార్తలనూ చదవండి:
సుప్రీంకోర్టులో వైసీపీకి చుక్కెదురు..
ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు