కిలాడీ దంపతులు.. వివాహిత నుంచి రూ. 55 లక్షలు దోచేశారు..
ABN , Publish Date - Mar 27 , 2026 | 07:08 PM
కిలాడీ దంపతుల మాయ మాటలు నమ్మి ఓ వివాహిత తీవ్రంగా నష్టపోయింది. ఆ దంపతులు సీబీఐలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ వివాహితనుంచి ఏకంగా 55 లక్షల రూపాయలు దోచేశారు.
అన్నమయ్య జిల్లా, మార్చి 27: కిలాడీ దంపతుల మాయ మాటలు నమ్మి ఓ వివాహిత తీవ్రంగా నష్టపోయింది. ఆ దంపతులు సీబీఐలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ వివాహితనుంచి ఏకంగా 55 లక్షల రూపాయలు దోచేశారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో వారి మోసం బయటపడింది. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం వనమలదిన్నెకు చెందిన లావణ్య అనే విహితకు కొన్ని నెలల క్రితం పుంగనూరు ప్రభుత్వ ఆస్పత్రిలో హేమప్రద అనే మహిళతో పరిచయం అయింది.
కొద్దిరోజుల తర్వాత హేమప్రద తన భర్త అశోక్‌ను సీబీఐ అధికారి అంటూ లావణ్యకు పరిచయం చేసింది. ఈ నేపథ్యంలో అశోక్, హేమప్రదలు సీబీఐలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. లావణ్య వద్దనుంచి 10 లక్షల రూపాయల నగదు, 42 లక్షల రూపాయల చెక్కులు తీసుకున్నారు. నెలలు గడుస్తున్నా ఉద్యోగం రాకపోవటంతో తాను మోసపోయానని లావణ్య గుర్తించింది. భార్యాభర్తలపై పుంగనూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
అన్నాడీఎంకే-బీజేపీ సీట్ల షేరింగ్‌పై అన్నామలై అసంతృప్తి.. పోటీకి దూరంగా ఉండే అవకాశం
శ్రీరామనవమి రోజు హోమం చేసిన చరణ్.. వీడియో షేర్ చేసిన చిరు..