తుఫాన్ సహాయ చర్యలకు రూ.37కోట్లు
ABN , Publish Date - Nov 03 , 2026 | 06:01 AM
‘మురసు’ తుఫాన్ నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టేందుకు, తక్షణ ఖర్చుల కోసం కోస్తాంధ్ర, రాయలసీమలోని 17 జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం రూ.37కోట్లు విడుదల చేసింది.
అమరావతి, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): ‘మురసు’ తుఫాన్ నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టేందుకు, తక్షణ ఖర్చుల కోసం కోస్తాంధ్ర, రాయలసీమలోని 17 జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం రూ.37కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, తుఫాన్ నేపథ్యంలో ఇరిగేషన్ ఉన్నతాధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాన్ ప్రభావం, వర్షాలు, వరద పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలని, ఫ్లడ్ కంట్రోల్ మేనేజ్‌మెంట్ చేపట్టాలని చెప్పారు.
ఈ వార్తలనూ చదవండి:
త్వరితగతిన రాష్ట్రానికి సాయం అందించండి.. కేంద్రానికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి
ఏపీ లిక్కర్ స్కామ్.. ఈడీ కస్టడీలో నిందితుడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి