మున్సిపల్ ఎన్నికల సిబ్బంది నియామక నిబంధనల్లో మార్పులు
ABN , Publish Date - Oct 14 , 2026 | 05:31 AM
పోలింగ్ సిబ్బంది నియామక నిబంధనలను పాక్షికంగా సడలిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం సర్క్యులర్ జారీచేసింది. దాని ప్రకారం... ఎన్నికల విధులకు నియమితులయ్యే సిబ్బంది సంబంధిత ..
వార్డుల క్లస్టర్ల వారీగా ఎన్నికల విధుల కేటాయింపు
అమరావతి, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): పోలింగ్ సిబ్బంది నియామక నిబంధనలను పాక్షికంగా సడలిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం సర్క్యులర్ జారీచేసింది. దాని ప్రకారం... ఎన్నికల విధులకు నియమితులయ్యే సిబ్బంది సంబంధిత రిటర్నింగ్ అధికారి లేదా వార్డు ఎన్నికల అధికారి పరిధిలోని 2, 4 వార్డులతో కూడిన క్లస్టర్లలో నివసించకూడదు. అంటే ఉద్యోగి తాను నివశిస్తున్న లేదా పనిచేస్తున్న క్లస్టర్లో ఎన్నికల విధుల్లో ఉండకూడదు. ఈ మేరకు కమిషన్ కార్యదర్శి మల్లికార్జున ఆదేశాలిచ్చారు.
ఈ వార్తలనూ చదవండి:
గిన్నిస్ బుక్లోకి 75 గంటల డప్పుమోత