అమరావతి పరిధిలో 68 పంచాయతీల ఎన్నికలు వాయిదా వేయండి
ABN , Publish Date - Oct 14 , 2026 | 05:35 AM
అమరావతి రాజధాని ప్రాంత పరిధిలోని 68 గ్రామ పంచాయతీలకు జరగాల్సిన సాధారణ ఎన్నికలను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.
రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వం లేఖ
అమరావతి, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): అమరావతి రాజధాని ప్రాంత పరిధిలోని 68 గ్రామ పంచాయతీలకు జరగాల్సిన సాధారణ ఎన్నికలను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మంగళవారం రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శికి లేఖ రాశారు. అమరావతి రాజధాని ప్రాంత అభివృద్ధి పనులు కొనసాగుతున్న నేపథ్యంలో మాస్టర్ ప్లాన్ను ఖరారు చేయడం, 68 గ్రామ పంచాయతీల పరిధిలో పట్టణ స్థానిక సంస్థల ఏర్పాటు, పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది.
ఈ వార్తలనూ చదవండి:
గిన్నిస్ బుక్లోకి 75 గంటల డప్పుమోత