Share News

249 నర్సింగ్‌ కళాశాలల్లో ప్రవేశాలకు అనుమతి

ABN , Publish Date - Oct 16 , 2026 | 05:30 AM

రాష్ట్రంలోని 249 కళాశాలల్లో మొదటి విడత కౌన్సెలింగ్‌లో ప్రవేశాలకు ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. మరో 10 కళాశాలల్లో ప్రవేశాలకు పూర్తి అర్హతలున్నాయని ఆంధ్రప్రదేశ్‌ నర్సెస్‌, మిడ్‌వైవ్స్‌ కౌన్సిల్‌ (ఏపీఎన్‌ఎంసీ) ఇప్పటికే విశ్వవిద్యాలయానికి తెలిపింది.

249 నర్సింగ్‌ కళాశాలల్లో ప్రవేశాలకు అనుమతి

అమరావతి, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలోని 249 కళాశాలల్లో మొదటి విడత కౌన్సెలింగ్‌లో ప్రవేశాలకు ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. మరో 10 కళాశాలల్లో ప్రవేశాలకు పూర్తి అర్హతలున్నాయని ఆంధ్రప్రదేశ్‌ నర్సెస్‌, మిడ్‌వైవ్స్‌ కౌన్సిల్‌ (ఏపీఎన్‌ఎంసీ) ఇప్పటికే విశ్వవిద్యాలయానికి తెలిపింది. ఫిర్యాదులు, తనిఖీల కారణంగా మిగిలిన కళాశాలల్లో ప్రవేశాలను రెండో కౌన్సెలింగ్‌లో చేపడతారని డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డాక్టర్‌ విష్ణువర్దన్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఎస్సీ నర్సింగ్‌లో ప్రవేశాలతోపాటు 50 కళాశాలలు పోస్ట్‌ బేసిక్‌ బీఎస్సీ (నర్సింగ్‌), 31 కళాశాలలు ఎంఎస్‌సీ (నర్సింగ్‌), కోర్సుల్లో ప్రవేశాలకు అర్హత పొందాయని తెలిపారు.

మొదటి కౌన్సెలింగ్‌లో ప్రవేశాలకు ఈనెల 13న నోటిఫికేషన్‌ జారీ అయింది. రాష్ట్రంలో మొత్తం 280 బీఎస్సీ నర్సింగ్‌ కళాశాలలు ఉండగా.. 249 కళాశాలల్లోనే ప్రవేశాలకు నోటిఫికేషన్‌ జారీ చేసి... 150 కళాశాలల్లో ప్రవేశాలను అర్థం లేకుండా పెండింగ్‌లో ఉంచారంటూ కొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని డీఎంఈ ఖండించారు.

ఈ వార్తలనూ చదవండి:

మీ ఛాయిస్‌ ఎవరు?

మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేయడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు

Updated Date - Oct 16 , 2026 | 05:30 AM