రాష్ట్రపతితో లోకేశ్ మర్యాదపూర్వక భేటీ
ABN , Publish Date - Oct 16 , 2026 | 04:03 AM
ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు, సరస్ మేళాలో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు విజయవాడ వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో మంత్రి లోకేశ్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
అమరావతి, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు, సరస్ మేళాలో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు విజయవాడ వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో మంత్రి లోకేశ్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. గురువారం ఉదయం విజయవాడలోని నోవాటెల్కు వెళ్లిన లోకేశ్, రాష్ట్రపతితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ద్రౌపది ముర్ముని శాలువాతో సత్కరించి, మంగళగిరి చేనేత చీర, ఏటికొప్పాక కళాకృతిని బహూకరించారు.
ఈ వార్తలనూ చదవండి:
మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేయడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు