Share News

వైసీపీకి చుక్కెదురు.. స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీం గ్రీన్ సిగ్నల్

ABN , Publish Date - Oct 09 , 2026 | 12:30 PM

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

వైసీపీకి చుక్కెదురు.. స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీం గ్రీన్ సిగ్నల్
Supreme Court nod to AP Local body elections

ఇంటర్నెట్ డెస్క్: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సర్ ప్రక్రియ తరువాతే స్థానిక ఎన్నికలు జరపాలన్న వైసీపీ వాదనను తోసిపుచ్చింది. ఎన్నికలకు ఆటంకం కలిగించడమంటే ప్రజాప్రయోజనాలను అడ్డుకోవడమేనని పేర్కొంది. ఈ విషయమై వైసీపీ వేసిన పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం తోసిపుచ్చింది.


ఏపీ ప్రభుత్వం తన వాదనలు వినిపిస్తూ హైకోర్టు సూచనల మేరకు ఆరు వారాల్లోపు నోటిఫికేషన్‌కు సిద్ధమని పేర్కొంది. ఆ లోపు సర్ ‌పూర్తైతే నూతన జాబితాను పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీం కోర్టు పేర్కొంది. లేని పక్షంలో పాత జాబితాతోనే ముందుకెళ్లాలని సూచించింది. ఈ విషయంలో ఏపీ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సమర్థించింది.


ఇదిలా ఉంటే, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్‌‌కు సంబంధించి ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టేసింది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతాన్ని మించరాదని స్పష్టం చేసింది. బీసీలకు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్ ఇస్తూ జారీ చేసిన జీవోలను హైకోర్టు కొట్టేయడాన్ని సుప్రీం కోర్టు సమర్థించింది. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోలేమని జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం పేర్కొంది.


ఈ వార్తలనూ చదవండి:

బీసీ రిజర్వేషన్లపై ఏపీ పిటిషన్.. విచారణకు నిరాకరించిన సుప్రీం కోర్టు

బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా చూస్తున్న గొడ్డలి పార్టీ: మంత్రి సత్యప్రసాద్

Updated Date - Oct 09 , 2026 | 12:38 PM